హండ్రెడ్ లీగ్ నుంచి ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఔటయ్యాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ స్థానాన్ని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ భర్తీ చేయనున్నాడు.
ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్ దశలో ఈ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రాకెట్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.
ప్రస్తుతానికి ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. వెల్ష్ ఫైర్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.
కాగా, ఇటీవల సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకుని ట్రెంట్ రాకెట్స్ ఓటమికి పరోక్ష కారకుడైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.
Comments
Please login to add a commentAdd a comment