హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన రసవత్తర పోరులో ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్వల్ప తేడాతో గటెక్కింది. ఇన్విన్సిబుల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి లండన్ స్పిరిట్ 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), విల్ జాక్స్ (42 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 46 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (17 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. లండన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, డారిల్ మిచెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ టీమ్.. ఆఖరి బంతి వరకు పోరాడి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సామ్ కర్రన్ వేసిన 98వ బంతిని క్రిచ్లీ సిక్సర్ బాది లండన్ గెలుపుపై ఆశలు చిగురింపజేయగా.. ఆఖరి బంతికి డాట్ బాల్ వేసి సామ్ కర్రన్ లండన్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఈ మధ్యలో పెద్ద డ్రామా జరిగింది. లండన్ 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో వైట్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో బౌండరీకి వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని 2 పరుగులు సేవ్ చేయగా, ఆఖరి బంతిని కర్రన్ నో బాల్ వేసి మళ్లీ లండన్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.
ఈ బంతికి క్రిచ్లీ రెండు పరుగు రాబట్టడంతో పాటు నో బాల్ ఫలితంగా లండన్‌కు అదనంగా మరో పరుగు, ఫ్రీ హిట్ లభించాయి. దీంతో ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సామ్ కర్రన్ ఆఖరి బంతిని అద్భుతమై యార్కర్‌గా సంధించడంతో లండన్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఫలింతగా ఇన్విన్సిబుల్స్ రసవత్తర పోరులో విజయం సాధించింది. లండన్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (61) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో మాథ్యూ క్రిచ్లీ (13 బంతుల్లో 32 నాటౌట్) ఇన్విన్సిబుల్స్ ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ చాపెల్, సామ్ కర్రన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment