Marcus Stoinis-Adam Zampa Breaks Internet With Viral Valentine's Day Post - Sakshi
Sakshi News home page

ప్రపంచానికి తెలియని ఆసీస్‌ క్రికెటర్ల ప్రేమకథ

Published Tue, Feb 14 2023 4:32 PM | Last Updated on Tue, Feb 14 2023 5:35 PM

Marcus Stoinis-Adam Zampa Break Internet With Viral Valentines Day Post - Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్‌ స్టోయినిస్‌, స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్‌(బిగ్‌బాష్‌ లీగ్‌)లో జరిగిన బ్రొమాన్స్‌ క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్‌) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్‌ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్‌, జంపాలు హోమోసెక్సువల్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్‌ఇన్‌ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. 

అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్‌లో.. ఇటు బిగ్‌బాష్‌ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్‌ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్‌ ఫ్రాంచైజీ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఒక ఫోటో షేర్‌ చేస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్‌ చెంపపై ఆడమ్‌ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ''హ్యాపీ వాలెంటైన్స్‌ డే'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్‌ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్‌ చేశారు.

ఇక బీబీఎల్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్‌ జంపా.. ఈ సీజన్‌లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్‌(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్‌ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బీబీఎల్‌ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

ఆస్ట్రేలియా తరపున మార్కస్‌ స్టోయినిస్‌ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్‌ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: క్రికెటర్‌ మనసు దోచుకున్న మల్లికా సాగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement