Adam Zampa
-
ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 231/5గా ఉంది. బెన్ డకెట్ (88 బంతుల్లో 101), జాకబ్ బెథెల్ (15 బంతుల్లో 6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అనంతరం సాల్ట్ ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో ఔట్ కాగా.. విల్ జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. జాక్స్ వచ్చీ రాగనే హార్డీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డకెట్‌కు కెప్టెన్ బ్రూక్ జత కలిశాడు. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.Harry Brook toying with Azam Zampa. pic.twitter.com/LFuqt2BTLL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్బ్రూక్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేయగా.. అందులో మెజార్టీ శాతం పరుగులు జంపా బౌలింగ్‌లోనే సాధించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలు సాధించగా.. కేవలం జంపా బౌలింగ్‌లోనే ఓ బౌండరీ, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు, ఓ బౌండరీ కేవలం 13 బంతుల వ్యవధిలో సాధించాడు. Harry Brook brings up his fifty with a six!!pic.twitter.com/rHltKptBTz— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపా బౌలింగ్‌లో బ్రూక్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. మరో ఎండ్‌లో డకెట్ తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను టెయిలెండర్ బెథెల్ సహకారంతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. బ్రూక్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జేమీ స్మిత్ (6), లివింగ్‌స్టోన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హార్డీ, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.బ్రూక్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..బ్రూక్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడుబ్రూక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కును తాకాడుఈ సిరీస్‌లో బ్రూక్‌కు ఇదివరకు మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (110, 87, 72)ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు (312) చేసిన కెప్టెన్‌గా రికార్డుగతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (310) పేరిట ఉండేదిడకెట్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..డకెట్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీడకెట్ తన తొలి సెంచరీని (ఐర్లాండ్) సైతం ఇదే గ్రౌండ్లో (బ్రిస్టల్) చేశాడుఈ సిరీస్‌లో డకెట్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (95, 63, 101)చదవండి: రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు -
రాణించిన ఆడమ్ జంపా.. ఘనంగా బోణీ కొట్టిన డిఫెండింగ్ ఛాంప్స్
ద హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్.. 81 బంతుల్లో 89 పరుగులకే ఆలౌటైంది. ఆడమ్ జంపా (20-10-11-3) ఫీనిక్స్ పతనాన్ని శాశించగా.. మొహమ్మద్ ఆమిర్, సకీబ్ మహమూద్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, నాథన్ సౌటర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (25), బెన్నీ హోవెల్ (24), బెతెల్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ కేవలం 69 బంతుల్లోనే విజయతీరాలకు (2 వికెట్ల నష్టానికి) చేరింది. విల్ జాక్స్ 6, తువండ మెయేయే 23 పరుగులు చేసి ఔట్ కాగా.. డేవిడ్ మలాన్ (24), సామ్ బిల్లింగ్స్ (31) అజేయంగా నిలిచారు. ఫీనిక్స్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు.కాగా, ఫీనిక్స్, ఇన్విన్సిబుల్స్ జట్లు నిన్ననే ప్రారంభమైన మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ ఫీనిక్స్‌పై ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఫీనిక్స్ 92 బంతుల్లో 105 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా ఇన్విన్సిబుల్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో పేజ్ స్కోల్ఫీల్డ్ (71), అలైస్ క్యాప్సీ (52) అర్ద సెంచరీలతో రాణించగా.. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో అమండ 3, మ్యాడీ విల్లియర్స్ 2, మారిజన్ కాప్, సోఫీ స్మేల్, ర్యానా మెక్ డొనాల్డ్ గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన ఆడమ్ జంపా.. తొలి ఆసీస్ ప్లేయర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం పసికూన నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్లను జంపా తన మయాజాలంతో ముప్పుతిప్పులు పెట్టాడు. జంపా తన 4 ఓవర్ల కోటాలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జంపా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఆస్ట్రేలియా బౌలర్‌గా జంపా రికార్డులకెక్కాడు. నమీబియా బ్యాటర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ను అవుట్ చేయడంతో జంపా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 100 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జంపా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నమీబియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 5.4 ఓవర్లలో ఛేదించింది. -
అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా మరో ముందడుగు వేసింది. నమీబియాతో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని సూపర్-8 దశకు అర్హత సాధించింది. ప్రత్యర్థిని 72 పరుగులకే పరిమితం చేసి.. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై జయభేరి మోగించి భారీ రన్‌రేటుతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నమీబియాపై భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో కీలక సభ్యుడైన ఆడం జంపా ఈ మ్యాచ్‌లో ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసించాడు.అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం‘‘ఈరోజు మా బౌలింగ్ విభాగం అత్యద్భుతంగా రాణించింది. సమిష్టి కృషితో దక్కిన విజయం ఇది. సూపర్-8కు అర్హత సాధించడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో వరుస గెలుపులు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఇక జంపా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.గత నాలుగైదేళ్లుగా మా జట్టులో అతడు అత్యంత ముఖ్యమైన సభ్యుడిగా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడం తన ప్రత్యేకత. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆడం జంపాను కొనియాడాడు.విండీస్‌లో బీచ్‌లు సూపర్ఇక వెస్టిండీస్ ఆతిథ్యం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. చాలా బీచ్‌లు ఇక్కడున్నాయి. ఒక్కోసారి మాకు పెర్త్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాతో కలిసి విండీస్ ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్-డి: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా👉వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా👉టాస్: ఆస్ట్రేలియా.. తొలుత బౌలింగ్👉నమీబియా స్కోరు: 72 (17)👉టాప్ స్కోరర్: గెర్హార్డ్ ఎరాస్మస్(43 బంతుల్లో 36 పరుగులు)👉ఆస్ట్రేలియా స్కోరు: 74/1 (5.4)👉టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 రన్స్, నాటౌట్)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సూపర్-8కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడం జంపా(4/12).చదవండి: T20 WC 2024: గెలిచి నిలిచిన పాక్ View this post on Instagram A post shared by ICC (@icc) -
నమీబియాను చిత్తు చేసిన ఆసీస్.. సూపర్-8కు అర్హత
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్‌లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్‌గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్‌కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది: ఆసీస్ స్టార్ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న ఆసీస్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన విజయాలు సాధించింది. తొలుత ఒమన్‌ను చిత్తు చేసిన కంగారులు.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించారు. తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 12న నమీబియాతో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే సూపర్-8కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2024లో ఆడకపోవడం తనకు కలిసొచ్చిందని జంపా తెలిపాడు. ఇప్పటివరకు ఆసీస్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జంపా.. ఈ ఏడాది సీజన్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. "ఐపీఎల్-2024లో ఆడకూడదని సీజన్ ఆరంభానికే ముందే నిర్ణయించుకున్నాను. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనదే అన్పించింది. ఎందుకంటే నిరంతర క్రికెట్‌తో నేను బాగా అలిసిపోయాను. ఈ లీగ్ ఆరంభ సమయానికి నేను కొంచెం మోకాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. ఒకవేళ ఐపీఎల్లో ఆడి మళ్లీ గాయం తిరగబెడితే వరల్డ్‌కప్‌నకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగాను.అదే విధంగా నాకు ఫ్యామిలీ కూడా. కొన్ని సార్లు పనికంటే ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యమని" క్రికెట్ ఆస్ట్రేలియాతో జంపా పేర్కొన్నాడు. కాగా ఈ ప్రస్తుత పొట్టిప్రపంచకప్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన జంపా 4 వికెట్లు పడగొట్టాడు. -
T20 World Cup 2024: అరుదైన క్లబ్లో చేరిన ఆసీస్ బౌలర్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అరుదైన క్లబ్లో చేరాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జంపా.. టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. జంపా ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 28 ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు ఆండ్రూ టై టీ20ల్లో 300 వికెట్ల మార్కును అధిగమించాడు. టై 2014-24 మధ్యలో 332 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టై 15వ స్థానంలో ఉన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 3 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 301 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో (625) అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ (576), సునీల్ నరైన్ (552), ఇమ్రాన్ తాహిర్ (502) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత బౌలర్ చహల్ (354) 11వ స్థానంలో.. పియూశ్ చావ్లా (315) 22, అశ్విన్ (310) 25వ స్థానంలో కొనసాగుతున్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
IPL 2024: కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసిన గుజరాత్, రాజస్థాన్
ఐపీఎల్ 2024 సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు వివిధ కారణాల చేత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు తమను మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేశాయి. వేలంలో జాక్‌పాట్ (3.6 కోట్లు) కొట్టి, బైక్ యాక్సిడెంట్ కారణంగా సీజన్ మొత్తానికే దూరమైన యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ స్థానాన్ని గుజరాత్ యాజమాన్యం మరో వికెట్‌కీపర్ బ్యాటర్ బీఆర్ శరత్‌తో (కర్ణాటక) భర్తీ చేయగా.. వ్యక్తిగత కారణాల చేత సీజన్ నుంచి తప్పుకున్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (1.5 కోట్లు) స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ ముంబై స్పిన్నర్ బ్యాటర్ తనుశ్ కోటియన్తో భర్తీ చేసింది. (తనుశ్ కోటియన్) కొత్తగా భర్తీ చేయబడ్డ శరత్, తనుశ్లను ఆయా ఫ్రాంచైజీలు బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ అతి త్వరలో ఆయా జట్లతో చేరతారని తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల రవి శరత్ కర్ణాటక తరఫున 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 42 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 28 టీ20లు ఆడి 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో అతను మొత్తంగా 162 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. (బీఆర్ శరత్) ముంబై రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన 25 ఏళ్ల తనుశ్ కోటియన్ సొంత జట్టు తరఫున 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 23 టీ20లు ఆడాడు. ఇందులో అతను 119 వికెట్లు 1300లకు పైగా పరుగులు చేశాడు. తనుశ్ ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ కీలక మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. ఇతని ఖాతాలో 11 ఫస్ట్‌క్లాస్ హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న (ముంబైతో) ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మార్చి 24ననే జరిగే మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ జరిగే సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్‌కు ఊహించని షాక్!
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదిహేడో ఎడిషన్‌కు దూరం కానున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ఆడం జంపాను కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు జంపాను రిటైన్ చేసుకుంది రాజస్తాన్. అయితే, అనూహ్యంగా తాజా సీజన్ ఆరంభానికి ముందు జంపా జట్టు నుంచి తప్పుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా ఈ ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక 31 ఏళ్ల ఆడం జంపా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 20 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు కూల్చాడు. కాగా ఇప్పటికే జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్ తదితర విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్-2024 బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఇక మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సేన(రాజస్తాన్ రాయల్స్) మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఇక జంపా తప్పుకోగా.. టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉండటం రాయల్స్‌కు సానుకూలాంశం. చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది.. Just a legend doing his thing in Pink. 🔥 pic.twitter.com/rpQ2KCDTmV — Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2024 -
నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఫెర్గూసన్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. ఫెర్గూసన్‌తో పాటు ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిడ్ హెడ్ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్ (28), మార్ష్ (26), టిమ్ డేవిడ్ (17), స్టీవ్ స్మిత్ (11), నాథన్ ఇల్లిస్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్‌వెల్ (6), ఇంగ్లిస్ (5), మాథ్యూ వేడ్ (1), జంపా (1), హాజిల్‌వుడ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. జంపా మాయాజాలం.. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆడమ్ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ (2/16), హాజిల్‌వుడ్ (1/12), కమిన్స్ (1/19), మార్ష్ (1/18) కూడా రాణించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (42) చేశాడు. ఫిలిప్స్‌తో పాటు జోష్ క్లార్క్సన్ (10), బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫిన్ అలెన్ (6), విల్ యంగ్ (5), సాంట్నర్ (7), చాప్మన్ (2), మిల్నే (0), ఫెర్గూసన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డెవాన్ కాన్వే బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్‌లో జరుగనుంది. -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్‌లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్‌లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్‌ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్‌ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్‌లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్
WC 2023 Aus Vs Ned- Pat Cummins Comments: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రికార్డు విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం తలపడింది ఆస్ట్రేలియా. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని డచ్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. డేవిడ్ వార్నర్(104) శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులు సాధించారు. ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు వీరి ముగ్గురి ఇన్నింగ్స్‌ను మరిపించేలా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 తరహా వినోదం అందించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు స్కోరు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) 90 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించిన ఆసీస్.. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకోగా.. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తర్వాత.. ఈ క్రమంలో వన్డే చరిత్రలో ప్రత్యర్థిని అత్యంత భారీ తేడాతో ఓడించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీమిండియా(శ్రీలంక మీద 317 పరుగుల తేడాతో) తర్వాత ఈ ఘనత సాధించిన టీమ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో విజయానంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన విజయం. ప్రత్యర్థికి 400 పరుగుల లక్ష్యాన్ని విధించడం.. దానిని కాపాడుకోవడం.. రెండింటిలోనూ మేము పూర్తిగా విజయవంతమయ్యాం. ఆ వందలో నాకూ భాగం ఉంది ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. క్రేజీ ఇన్నింగ్స్. ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మా ఇద్దరి పాత్ర సమానమే కదా(నవ్వులు).. అద్భుతమైన ఇన్నింగ్స్. నేనిలాంటి క్లీన్ హిట్టింగ్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ మాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా స్మిత్ కూడా హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్న కమిన్స్.. ‘‘మా ఆట తీరు ఎలా ఉండాలనుకుంటామో ఈరోజు అలాగే ఆడాం. పవర్ ప్లేలో వీలైనన్ని వికెట్లు తీయాలన్న వ్యూహం అమలు చేశాం. జంపా మరోసారి నాలుగు వికెట్లు కూల్చాడు’’ అని బౌలింగ్ విభాగాన్ని కూడా ప్రశంసించాడు. మాక్సీ- కమిన్స్ జోడీ చరిత్ర.. అందుకే అలా సరదాగా కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ చరిత్రలో 100+ పరుగుల భాగస్వామ్యంలో హయ్యస్ట్ రన్‌రేటు(14.37 (103) సాధించిన మూడో జోడీగా మాక్స్వెల్- కమిన్స్ జోడీ చరిత్ర సృష్టించింది. ఈ గణాంకాలను ఉద్దేశించే కమిన్స్.. మాక్సీతో పాటు తాను కూడా ఈ పార్ట్నర్షిప్లో సమాన పాత్ర పోషించానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: WC 2023: పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా..
ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. డచ్ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న డచ్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది. తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర తద్వారా ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యంత భారీ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(104) సెంచరీతో అదరగొట్టగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించారు. మాక్సీ పరుగుల సునామీ వీరిద్దరు అర్ధ శతకాలతో రాణిస్తే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు,8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. మాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించింది. స్టార్క్ ఆరంభిస్తే.. జంపా ముగించాడు ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆసీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. పేసర్ మిచెల్ స్టార్క్ వికెట్ల పతనం ఆరంభించగా.. స్పిన్నర్ ఆడం జంపా లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ క్రమంలో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. 21 పరుగులకే కథ ముగించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ తీయగా.. బ్యాట్‌తో రాణించలేకపోయిన మిచెల్ మార్ష్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ మీద ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఫాస్టెస్ట్ సెంచరీ హీరో గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
WC 2023- Australia vs Netherlands: నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బాస్ డి లిడేకు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భాగంగా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా ఈ ఆల్‌రౌండర్ నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిక్ లూయీస్, ఆడం జంపాలను అధిగమించి చెత్త గణాంకాలతో చరిత్రకెక్కాడు. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బౌలింగ్ చేసింది. ఆ ఆనందం కాసేపే ఈ క్రమంలో డచ్ పేసర్ లోగన్ వాన్ బీక్ ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. వాళ్లంతా ఒకెత్తు.. మాక్సీ మరో ఎత్తు వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(71)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుత శతకం(104)తో భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక వార్నర్, స్మిత్‌లతో పాటు మార్నస్ లబుషేన్ కూడా బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 47 బంతుల్లో 62 పరుగులతో రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఆడుకోవడంలో ఈ ముగ్గురు ఒక ఎత్తైతే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరో ఎత్తు. డచ్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 44 బంతుల్లోనే మొత్తంగా 106 పరుగులు రాబట్టాడు. రెండో అత్యుత్తమ స్కోరు వార్నర్, స్మిత్, లబుషేన్.. మాక్సీ.. ఇలా ఈ నలుగురి విజృంభణతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 399 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్ చరిత్రలో తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. పాపం.. బాస్ బలి అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ల పరుగుల దాహానికి బలైపోయిన బౌలర్లలో బాస్ డి లిడే ముందు వరుసలో ఉన్నాడు. ఈ రైట్ఆర్మ్ మీడియం పేసర్ తన 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 115 పరుగులు సమర్పించుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బాస్ డి లిడే నిలిచాడు. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్ రూపంలో రెండు వికెట్లు తీయడం ఒక్కటే అతడికి కాస్త ఊరట. బాస్ డి లిడే సంగతి ఇలా ఉంటే.. నెదర్లాండ్స్ ఇతర బౌలర్లలో వాన్ బీక్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్‌కు ఒక్క వికెట్ దక్కింది. ఇంటర్నేషనల్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు వీరే ►2/115 (10) - బాస్ డి లిడే(నెదర్లాండ్స్)- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో- ఢిల్లీ-2023 ►0/113 (10) - మిక్ లూయిస్(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- జొహన్నస్‌బర్గ్- 2006 ►0/113(10) - ఆడం జంపా(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- సెంచూరియన్- 2023 ►0/110 (10)- వాహబ్ రియాజ్(పాకిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- నాటింగ్‌హాం- 2016 ►0/110 (9) - రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- మాంచెస్టర్- 2019. చదవండి: WC 2023: వార్నర్ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్‌తో పాటు View this post on Instagram A post shared by ICC (@icc) -
AUS VA SL: వెన్నునొప్పితో బాధపడుతూనే బరిలోకి దిగాడు.. తొలి విజయాన్ని అందించాడు
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా (8-1-47-4) ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వెన్ను సమస్యతో బాధపడుతూనే బరిలోకి దిగిన జంపా.. నొప్పిని దిగమింగుతూ బౌలింగ్ చేసి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో జంపా కీలక వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాశించాడు. భీకర ఫామ్‌లో ఉన్న కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లతో పాటు చమిక కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టాడు. పరుగు వ్యవధిలో గత మ్యాచ్ సెంచరీ హీరోలు కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లు పడగొట్టిన జంపా.. ఆఖర్లో 2 పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. నొప్పిని దిగమింగుతూ జంపా చేసిన విన్యాసాలకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, స్పిన్నర్లకు అనుకూలిస్తున్న భారత పిచ్‌లపై ప్రస్తుత వరల్డ్‌కప్‌లో జంపాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఎడిషన్‌లో ఆసీస్ ఓడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన జంపా.. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చి తన జట్టుకు ఎంతో అవసరమైన విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 ఓవర్లలో వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్న జంపా.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి జంపా ప్రదర్శన కారణంగా ఆసీస్ ప్రస్తుత ఎడిషన్‌లో తొలి విజయం సాధించింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి. -
4 వికెట్లతో చెలరేగిన జంపా.. 209 పరుగులకు శ్రీలంక ఆలౌట్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే నిస్సాంక ఔట్ అయిన తర్వాత శ్రీలంక పతనం మొదలైంది. వరుస క్రమంలో లంక వికెట్లు కోల్పోయింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 9వికెట్లను లంక కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరిలో మ్యాక్స్‌వెల్ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: SMT 2023: తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన హైదరాబాద్ -
CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు గాయపడ్డ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్
చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్విమ్మంగ్ పూల్‌లో గాయపడ్డాడు. కళ్లు మూసుకుని స్విమ్మింగ్ చేసిన జంపా పూల్‌లో ఉన్న మెట్లను గుద్దుకుని గాయాలపాలయ్యాడు. జంపా ముఖంపై, ఇతర చోట్ల గాయాలైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే ఈ స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే ప్రమాదమేమీ లేదని సీఏ క్లారిటీ ఇచ్చింది. జంపా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉపఖండపు స్విమ్మింగ్ పూల్లలో గాయపడటం ఇది కొత్తేమీ కాదు. గతేడాది ఆ జట్టు వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ కరాచీలోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కిందపడిపోయాడు. ఆ సమయంలో క్యారీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత క్యారీ బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. కెరీర్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ తర్వాత ఆడిన 9 టెస్ట్‌ల్లో 71.83 సగటున పరుగులు చేశాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. పూల్‌లో పడిపోవడం క్యారీకి, ఆసీస్‌కు కలిసొచ్చినట్లుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌లో జంపా ఆడటంపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం మాత్రం ఆసీస్‌ను ప్రధానంగా వేధిస్తుంది. గాయాం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది. మరోవైపు గాయాల బెడద టీమిండియాకు కూడా ప్రధాన సమస్యగా మారింది. అసలే శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేక సతమతమవుతున్న భారత్‌కు హార్దిక్ పాండ్యా చేతి గాయం పెద్ద తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఆసీస్‌తో ఇవాల్టి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖరారు కాగా.. హార్దిక్ సైతం గిల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హార్దిక్ గాయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని టీమిండియా మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. ఏదిఏమైనప్నపటికీ.. గిల్, పాండ్యా ఇద్దరూ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే అది టీమిండియా విజయావకాశాలను భారీ దెబ్బతీస్తుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్‌పై ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జంపా.. క్లాసెన్‌ను కేవలం 6 పరుగులకే క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్‌లో ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి, సిరీస్‌లో సమంగా నిలిచాయి. -
అక్కడుంది ధోని.. టార్గెట్ మిస్సయ్యే చాన్స్ లేదు!
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సీఎస్కే కెప్టెన్‌గా 200వది. దీంతో సీఎస్కే మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి ధోనికి కానుకగా అందివ్వాలని చూస్తోంది. ఇక ధోని కెప్టెన్‌గా తన 200వ మ్యాచ్‌లో సూపర్ రనౌట్‌తో మెరిశాడు. మాములుగానే ధోని చేతికి బంతి చిక్కిందంటే రెప్పపాటులో వికెట్లను గిరాటేస్తాడు. తాజాగా రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని ఆడమ్ జంపా షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. తీక్షణ క్యాచ్ వదిలేయడంతో సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే క్యాచ్ మిస్ చేసినప్పటికి తీక్షణ సరైన త్రో వేశాడు. త్రో అందుకున్న ధోని ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా నేరుగా వికెట్లను గిరాటేశాడు. అయితే ఇదే సమయంలో తుషార్ దేశ్‌పాండే తనకు బంతి వేయమని ధోనిని అడగడం గమనించొచ్చు. కానీ ధోని ఎవరికి అవకాశం ఇవ్వకూడదని భావించి తానే రనౌట్ చేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. Always on target @msdhoni 🎯🤩 pic.twitter.com/Z7br8nJ4zh — CricTracker (@Cricketracker) April 12, 2023 చదవండి: అరుదైన ఫీట్.. టీమిండియా తరపున తొమ్మిదో బౌలర్‌గా -
WC 2023: వాళ్లిద్దరు చెలరేగితే ఈసారి ట్రోఫీ ఆసీస్‌దే: రిక్కీ పాంటింగ్
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఆసీస్‌కు ఇద్దరు బౌలర్లు కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. వారిద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కంగారు జట్టు ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ ఈసారి కూడా వన్డే ప్రపంచకప్-2023కు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. వాళ్లిద్దరు విజృంభిస్తే ఈ నేపథ్యంలో భారత్ వేదికగా అక్టోబరులో మొదలుకానున్న మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. పేసర్ మిచెల్ స్టార్క్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా విజృంభిస్తే ఈసారి ఆసీస్‌కు తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. వీరిద్దరు చెలరేగితే టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘మిచెల్ స్టార్క్ .. ఆరడుగుల ఐదు అంగుళాల ఎత్తు.. లెఫ్టార్మర్.. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు ఫామ్‌లో ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! పరిమిత ఓవర్ల క్రికెట్లో గణాంకాలు చూస్తే స్టార్క్ సత్తా ఏమిటో అర్థమవుతుంది. ట్రంప్ కార్డ్ అతడే ఇక ఆడం జంపా. స్టార్క్‌తో పాటు జంపా కూడా గత నాలుగైదేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. ఆసీస్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకలా మారాడు. ఇటీవల టీమిండియాతో సిరీస్‌లో అతడు లేని లోటు కనిపించింది. లెగ్ స్పిన్నర్ జంపా రానున్న వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ట్రంప్ కార్డ్‌గా మారనున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2015 ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ 8 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత రెండు పర్యాయాల్లో ఆసీస్ తరఫున ఈ ఐసీసీ ఈవెంట్లో లీడ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇక జంపా.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా బిజీబిజీగా ఉన్నాడు. చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ ఆడమ్ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్)లో జరిగిన బ్రొమాన్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్, జంపాలు హోమోసెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్ఇన్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో.. ఇటు బిగ్‌బాష్ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్ ఫ్రాంచైజీ మెల్బోర్న్ స్టార్స్ ఒక ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్ చెంపపై ఆడమ్ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్ చేశారు. ఇక బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్ జంపా.. ఈ సీజన్లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్బోర్న్ స్టార్స్ బీబీఎల్ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. happy valentine's day 🥰 pic.twitter.com/tv5dkKlxi3 — KFC Big Bash League (@BBL) February 13, 2023 Ohk, happy Valentines Day 🌝👍🏻 pic.twitter.com/XgGrTDNYvS — 𝐀𝐬𝐡𝐦𝐢𝐭𝐚 (@samaira__kohli) February 14, 2023 చదవండి: క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్ -
జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా?
బిగ్‌బాష్ లీగ్-2022లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెనిగేడ్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా నాన్-స్ట్రైకర్ టామ్ రోజర్స్‌ను రనౌట్(మన్కడింగ్) చేయడానికి ప్రయత్నించాడు. జంపా బంతి వేయకముందే రోజర్స్ క్రీజును వదిలి బయటకు వెళ్లగా.. అది గమనించిన అతడు వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో రనౌట్‌కు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. కాగా పలు మార్లు రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కాగా కొత్త రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను సాధారణ రనౌట్‌గానే పరిగిణిస్తారు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ మాత్రం ఎందుకు నాటౌట్‌గా ప్రకటించాడన్నది ప్రేక్షకులకు ఆర్ధం కాలేదు. థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే? మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ జంపా మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై రెనెగేడ్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. Spicy, spicy scenes at the MCG. Not out is the call...debate away, friends! #BBL12 pic.twitter.com/N6FAjNwDO7 — KFC Big Bash League (@BBL) January 3, 2023 చదవండి: IND vs SL: దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు -
లంకతో పోరుకు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. కీలక బౌలర్‌కు అనారోగ్యం
టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియాకు శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరుగబోయే కీలక పోరుకు ముందు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధృవీకరించింది. జంపా.. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని, అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీఏ పేర్కొంది. జంపా కీలక బౌలర్ కావడంతో, కరోనా లక్షణాలు కూడా స్వల్పంగా ఉండటంతో అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సీఏకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఆసీస్ యాజమాన్యం జంపాను పక్కకు పెట్టాలని భావిస్తే, అతని స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి వస్తాడని అతను తెలిపాడు. కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ బరిలోకి దిగాడు. ఇదిలా ఉంటే, తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో ఓడి సెమీస్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా.. లంకతో జరగాల్సిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించే గ్రూప్-1లో అన్ని జట్లు పటిష్టమైనవే కావడంతో సెమీస్ బెర్తులకు తీవ్ర పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ తొలి మ్యాచ్‌లో ఓడటంతో తదుపరి జరిగే 4 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. చదవండి: ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా? -
Ind Vs Aus: పాక్ రికార్డును సమం చేసిన రోహిత్ సేన! ఇక విరాట్ వికెట్ విషయంలో..
India Vs Australia T20 Series- 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది మొహాలీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 46 పరుగులు- నాటౌట్)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో సమంగా.. ఇక 2022లో టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది ఇరవయవ విజయం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో జట్టుగా రోహిత్ సేన నిలిచింది. పాక్ పేరిట ఉన్న రికార్డు(2021లో 20 విజయాలు)ను సమం చేసింది. దీనితో పాటు నాగ్‌పూర్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేమిటంటే.. హిట్‌మ్యాన్ రెండు రికార్డులు! అంతర్జాతీయ టీ20లలో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఆసీస్‌తో రెండో మ్యాచ్‌లో 4 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. పొట్టి ఫార్మాట్లో 500 బౌండరీల మార్కును అందుకున్నాడు. ఇక 478 బౌండరీలతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రోహిత్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అదే విధంగా అత్యధిక సిక్సర్లు(176) బాదిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. విరాట్ వికెట్ విషయంలో.. నాగ్‌పూర్ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి ఆసీస్ బౌలర్ ఆడం జంపాకు వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి.. ఈ లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇది ఎనిమిదోసారి. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ తర్వాత కోహ్లిని అత్యధిక సార్లు పెవిలియన్‌కు పంపిన రెండో బౌలర్‌గా జంపా నిలిచాడు. సౌథీ టీ20లలో రెండుసార్లు, వన్డేలో ఆరు సార్లు కోహ్లి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జంపా పొట్టి ఫార్మాట్లో మూడుసార్లు, వన్డేల్లో ఐదు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో రెండు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు జంపా. చదవండి: Jasprit Bumrah-Aaron Finch: బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా