ఐపీఎల్ 2024 సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు వివిధ కారణాల చేత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు తమను మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేశాయి.
వేలంలో జాక్‌పాట్ (3.6 కోట్లు) కొట్టి, బైక్ యాక్సిడెంట్ కారణంగా సీజన్ మొత్తానికే దూరమైన యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ స్థానాన్ని గుజరాత్ యాజమాన్యం మరో వికెట్‌కీపర్ బ్యాటర్ బీఆర్ శరత్‌తో (కర్ణాటక) భర్తీ చేయగా.. వ్యక్తిగత కారణాల చేత సీజన్ నుంచి తప్పుకున్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (1.5 కోట్లు) స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ ముంబై స్పిన్నర్ బ్యాటర్ తనుశ్ కోటియన్‌తో భర్తీ చేసింది.
(తనుశ్ కోటియన్)
కొత్తగా భర్తీ చేయబడ్డ శరత్, తనుశ్‌లను ఆయా ఫ్రాంచైజీలు బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ అతి త్వరలో ఆయా జట్లతో చేరతారని తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల రవి శరత్ కర్ణాటక తరఫున 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 42 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 28 టీ20లు ఆడి 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో అతను మొత్తంగా 162 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు.
(బీఆర్ శరత్)
ముంబై రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన 25 ఏళ్ల తనుశ్ కోటియన్ సొంత జట్టు తరఫున 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 23 టీ20లు ఆడాడు. ఇందులో అతను 119 వికెట్లు 1300లకు పైగా పరుగులు చేశాడు. తనుశ్ ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ కీలక మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. ఇతని ఖాతాలో 11 ఫస్ట్‌క్లాస్ హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న (ముంబైతో) ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మార్చి 24ననే జరిగే మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ జరిగే సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment