సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలో చాలా కోణాలున్నాయని ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తెలిపాడు. మైదానంలో చూసే కోహ్లికి, ఆఫ్ ద ఫీల్డ్ చూసే కోహ్లికి చాలా తేడా ఉంటుందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన జంపా.. కోహ్లితో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతీ ఒక్కరి విషయంలో కోహ్లి చాలా హుందాగా ఉంటాడని ఈ మేరకు జంపా తెలిపాడు. మైదానంలో ప్రత్యర్థి జట్ల విషయంలో దూకుడుగా ఉండే కోహ్లి, మైదానం బయట మాత్రం ఆటగాళ్లతో చాలా సౌకర్యవంతంగా ఉంటాడన్నాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జంపా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.(‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’)
‘ఆర్సీబీతో నా తొలి ఇంటరాక్షన్ కొత్తగా అనిపించలేదు. అందుకు కారణం కెప్టెన్ కోహ్లినే. నాతో ఎంతో పరిచయం ఉన్నట్లు కోహ్లి ప్రవర్తించేవాడు. ఆటకు సంబంధించి ప్రతీ విషయాన్ని చెప్పేవాడు. నేను దుబాయ్‌లో దిగిన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేశాడు.నేను బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా చాట్ చేశాడు. కోహ్లి దూకుడు ఏదైనా ఉందంటే అది మైదానం వరకే ఉంటుంది. కాంపిటేషన్‌ను బాగా ఇష్టపడతాడు. ఏజట్టుకు ఆడినా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళతాడు. ఓటమిని అసహ్యించుకుంటాడు. ట్రెయినింగ్ సెషన్‌లో కానీ గేమ్‌లో కానీ పోటీ ఉండాలని కోహ్లి కోరుకుంటాడు. ఒక్క సారి ఫీల్డ్‌ను వదిలి పెడితే కూల్‌గా వ్యవహరిస్తాడు. కోహ్లి యూట్యూబ్ క్లిప్స్‌ను ఆస్వాదిస్తాడు. బస్సులో ప్రయానించేటప్పుడు యూట్యూబ్ క్లిప్స్ చూసి బిగ్గరగా నవ్వుతాడు. ఒక సరదా రనౌట్ క్లిప్‌ను చూసి కొన్ని వారాల పాటు తలచుకుని తలచుకుని నవ్వుకున్నాడు’ అని జంపా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment