T20 WC 2021 Winner Australia: Aaron Finch Comments On David Warner Adam Zampa - Sakshi
Sakshi News home page

T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్‌ మాత్రం.. చాలా గర్వంగా ఉంది..

Published Mon, Nov 15 2021 12:24 AM | Last Updated on Mon, Nov 15 2021 3:21 PM

T20 WC 2021 Winner Australia: Aaron Finch Comments On David Warner Adam Zampa - Sakshi

T20 WC 2021 Winner Australia: Aaron Finch Comments On David Warner Adam Zampa: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్‌ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం’’ అని టీ20 వరల్డ్‌కప్‌-2021 చాంపియన్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ హర్షం వ్యక్తం  చేశాడు. ఆసీస్‌కు ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్‌ టైటిల్‌ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు.

నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్‌ వార్నర్‌(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్‌ మార్ష్‌(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలవగా..  మార్ష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం కెప్టెన్‌ ఫించ్‌ మాట్లాడుతూ.. వార్నర్‌, ఆడం జంపా, మార్ష్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘తన పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌. మార్ష్‌ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్‌ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్‌ తన పనిని పూర్తి చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.

స్కోర్లు:
న్యూజిలాండ్‌- 172/4 (20)
ఆస్ట్రేలియా- 173/2 (18.5)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement