రాజస్తాన్ రాయల్స్‌కు ఊహించని షాక్! (PC: BCCI/RR)
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం.
వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదిహేడో ఎడిషన్‌కు దూరం కానున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ఆడం జంపాను కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు జంపాను రిటైన్ చేసుకుంది రాజస్తాన్.
అయితే, అనూహ్యంగా తాజా సీజన్ ఆరంభానికి ముందు జంపా జట్టు నుంచి తప్పుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా ఈ ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు.
ఇక 31 ఏళ్ల ఆడం జంపా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు కూల్చాడు. కాగా ఇప్పటికే జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్ తదితర విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్-2024 బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
ఇక మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సేన(రాజస్తాన్ రాయల్స్) మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఇక జంపా తప్పుకోగా.. టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉండటం రాయల్స్‌కు సానుకూలాంశం.
చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది..
Just a legend doing his thing in Pink. 🔥 pic.twitter.com/rpQ2KCDTmV
— Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2024
Comments
Please login to add a commentAdd a comment