టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న ఆసీస్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన విజయాలు సాధించింది. తొలుత ఒమన్‌ను చిత్తు చేసిన కంగారులు.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించారు.
తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 12న నమీబియాతో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే సూపర్-8కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2024లో ఆడకపోవడం తనకు కలిసొచ్చిందని జంపా తెలిపాడు. ఇప్పటివరకు ఆసీస్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జంపా.. ఈ ఏడాది సీజన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.
"ఐపీఎల్-2024లో ఆడకూడదని సీజన్ ఆరంభానికే ముందే నిర్ణయించుకున్నాను. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనదే అన్పించింది. ఎందుకంటే నిరంతర క్రికెట్‌తో నేను బాగా అలిసిపోయాను.
ఈ లీగ్ ఆరంభ సమయానికి నేను కొంచెం మోకాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడి మళ్లీ గాయం తిరగబెడితే వరల్డ్‌కప్‌నకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగాను.
అదే విధంగా నాకు ఫ్యామిలీ కూడా. కొన్ని సార్లు పనికంటే ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యమని" క్రికెట్ ఆస్ట్రేలియాతో జంపా పేర్కొన్నాడు. కాగా ఈ ప్రస్తుత పొట్టిప్రపంచకప్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన జంపా 4 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment