జంపా ట్యాంపరింగ్‌ చేశాడా? | Adam Zampa Tamper Accusations of Australia Ball Tampering Go Viral | Sakshi
Sakshi News home page

జంపా ట్యాంపరింగ్‌ చేశాడా?

Published Mon, Jun 10 2019 9:31 AM | Last Updated on Mon, Jun 10 2019 9:31 AM

Adam Zampa Tamper Accusations of Australia Ball Tampering Go Viral - Sakshi

జంపా అనుమానస్పద తీరు

లండన్‌ : ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ట్యాంపరింగ్‌కు యత్నించాడా? అతను ప్రతి బంతికి జేబులో చేతులు ఎందుకు పెడ్తున్నాడు? జేబులో ఏముంది.. సాండ్‌ పేపరా? అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు తగ్గట్టే  మైదానంలో జంపా తీరు టాంపరింగ్‌ సందేహాలను రేకెత్తించింది. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో జంపా తన తొలి స్పెల్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పదేపదే తన ప్యాంటు జేబులో చేతులు పెట్టి తీయడం.. బంతిని రుద్దడంతో ఈ అనుమానాలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తూ ఐసీసీ దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే గతేడాది కిందట చోటుచేసుకున్న బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఆసీస్‌ జట్టును ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. అలాంటిది ఆ జట్టు ఆటగాళ్లు టాంపరింగ్‌ గురించి ఆలోచన చేస్తారని మాత్రం అనుకోలేం.
(చదవండి : మావాళ్ల తరఫున సారీ స్మిత్‌ : కోహ్లి)

అది హ్యాండ్‌ వార్మర్‌..
ఈ సందేహాలను ఆసీస్‌ క్యాంప్‌ నివృత్తి చేసింది. జంపా హ్యాండ్‌వార్మర్‌ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని తెలిపారు. ఈ సాధానాన్ని బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా అతను ఉపయోగిస్తాడని పేర్కొంది. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే ఉపయోగిస్తాడని స్పష్టం చేసింది. (చదవండి : కంగారూలను కసిగా...)

ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సైతం ఈ వ్యవహారంపై మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. ‘ నేను ఆ ఫొటోలను చూడలేదు. కానీ అతని జేబులో హ్యాండ్‌ వార్మర్‌ ఉందని తెలుసు. ప్రతి మ్యాచ్‌లో జంపా దాన్ని ఉపయోగిస్తాడు. ఆ ఫొటోలను చూడలేదు కాబట్టి దానిపై ఎక్కువగా మాట్లాడలేను. కానీ వాస్తవం మాత్రం అతను హ్యాండ్‌ వార్మర్‌ను ఉపయోగించడం’ అని పేర్కొన్నాడు. గతేడాది నవంబర్‌లో జంపా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా ఈ తరహా ఫొటోలు, వీడియోలు సందేహాలను రేకెత్తించాయి. కానీ అప్పుడు కూడా అతను హ్యాండ్‌ వార్మర్‌ ఉపయోగిస్తాడనే స్పష్టమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement