మెక్‌కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇదే విషయంపై భారత జట్టును అంపైర్ బెన్ ట్రెలోర్, షవాన్ క్రెగ్‌లు మందలించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సైతం తాము ఏ తప్పు చేయలేదని అంపైర్‌లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే?
ఆఖరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎ విజయానికి 86 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్టర్ భారత ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అంపైర్ షాన్ క్రెయిగ్ భారత జట్టుకు కొత్త బంతిని అందించాడు.
అయితే బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. 'మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా స్టంప్ మైక్రోఫోన్‌లో రికార్డు అయింది. అయితే అంపైర్ వ్యాఖ్యలకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఘాటుగా బదులిచ్చాడు. "మేము ఏమీ చేయలేదు. మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’’ అని అన్నాడు. ఈ క్రమంలో కిషన్‌పై అంపైర్ అగ్రహం వ్యక్తం చేశాడు. మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నాడు.
క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా..
ఇక ఈవివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత ఆటగాళ్లు ఎవరూ ఎటువంటి బాల్ టాంపరింగ్ పాల్పడలేదు. పూర్తిగా దెబ్బతిన్నడం వల్లనే బంతిని మార్చాల్సి వచ్చింది. ఈ విషయం నాలుగో రోజు ఆటకు ముందే ఇరు జట్ల కెప్టెన్, మేనేజర్‌కు తెలియజేశారు. ఈ వివాదంపై తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోబడవు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: IND vs NZ: ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో
Comments
Please login to add a commentAdd a comment