క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో 12 రోజుల్లో తెరలేవనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షురూ కానుంది.
ఈ క్రమంలో తొలి టెస్టుకు 13 సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లిష్‌లకు చోటు దక్కింది. తొలి టెస్టుకు మైఖల్ నసీర్ గాయం కారణంగా దూరమయ్యాడు. భారత్-ఎ జట్టుతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో నసీర్ గాయపడ్డాడు.
ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీనీ..
భారత్-ఎ జట్టుతో జరిగిన సిరీస్‌లో నాథన్ మెక్‌స్వీనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.రెండు మ్యాచ్‌ల్లోనూ మెక్‌స్వీనీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. పెర్త్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మెక్‌స్వీనీ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
జోష్ ఇంగ్లిష్ కూడా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్టులో కీలక సభ్యునిగా ఉన్న ఇంగ్లిష్.. ఇప్పుడు క్యారీకి బ్యాకప్‌గా చోటు సంపాదించుకున్నాడు.
పెర్త్ టెస్టుకు ఆసీస్ జట్టు: స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
చదవండి: ‘పాకిస్తాన్‌లో ఆడేదే లేదు’
Comments
Please login to add a commentAdd a comment