భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ పాల్పడందని బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. 15 ఓవర్‌లో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసందని, కోహ్లి, పుజారాలు ఔట్ కావడానికి ఇదే కారణమని అతడు అన్నాడు.
"కామెంటరీ బాక్స్‌లోంచి మ్యాచ్ చూస్తున్న వారికి, అంపైర్‌లకు ముందుగా చప్పట్లు కొట్టాలి అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా కచ్చితంగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ఏదో చేసింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బ్యాటర్లు కూడా దాన్ని పెద్దగా గమనించలేదు.
బ్యాటర్లు బాల్ ను వదిలేస్తూ బౌల్డ్ అయ్యారు. అంతే తప్ప ఏం జరుగుతుందని ఆలోచించలేకపోయారు. ఈ ఆరోపణలకు నా దగ్గర ఆధారం కూడా ఉంది. భారత ఇన్నింగ్స్ 17, 18, 19 ఓవర్లు ఓసారి చూడండి. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు బంతికి మెరుపు ఏవైపు ఉందో ఓ సారి గమనించండి. మిచెల్ స్టార్క్ బంతి పట్టుకున్నప్పుడు మెరుపు బంతికి బయటి ఉంది.
కానీ బంతి మాత్రం లోపలకు వచ్చింది. మెరుపు బయట వైపు ఉండి బంతి ఎప్పుడూ రివర్స్ స్వింగ్ అవ్వదు. ఆసీస్ ఎదో చేసింది. అదే విధంగా జడేజా బాల్ ను ఆన్ సైడ్ ఆడుతుంటే అది పాయింట్ వైపు వెళ్తోంది. ఇది అంపైర్‌లకు కనిపించలేదా? ఈ చిన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు అంటూ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో విమర్శలు గుప్పించాడు.
చదవండి: ఇటువంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment