
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఈ తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది.
పోర్ట్స్‌మౌత్‌లోని అరుండెల్ మైదానంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పైనే కాకుండా ఫీల్డింగ్‌పై కూడా రోహిత్ సేన దృష్టిసారించింది. ఈ క్రమంలో రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లండ్ వంటి స్వింగింగ్ పరిస్థితుల్లో చివరి నిమిషాల్లో బంతి గమనంలో మార్పునకు ఆటగాళ్లు అలవాటు పడేందుకు ఈ ప్రత్యేక బంతులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
"ఈ బంతులు గల్లీ క్రికెట్‌లో మనం చూసేవి కావు. ఇవి ప్రత్యేకంగా తయారు చేయబడిన రబ్బరు బంతులు. ఇవి ఫీల్డింగ్ డ్రిల్స్ కోసం తయారు చేస్తారు. వీటిని 'రియాక్షన్ బాల్స్' అంటారు. వీటిని కొన్ని దేశాల పరిస్థితుల బట్టి మాత్రమే వాడుతారు. ఎక్కువగా గాలి, చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్‌లో వీటిని ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయెగిస్తారు" అని ఏన్సీఏలో పనిచేసిన ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ ఒకరు న్యూస్ 18తో పేర్కొన్నారు.
చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment