భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్‌లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్..
రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్‌ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్‌ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్ తలో 2 సెంచరీలు చేశారు.
టాప్‌లో జంపా..
రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment