క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరి పోరాటంలో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూ జట్టు.. ఎక్కడా కూడా తడబాటు పడకుండా తమ ప్లాన్‌ను అమలుచేసింది. దీంతో దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది. 2003 తర్వాత అదే జట్టుతో ఫైనల్ ఫైట్ మళ్లీ ఎదురైంది.. అప్పటి ఓటమి లెక్కలు సరిచేసి ఇప్పుడు గెలిచి రివేంజ్ తీర్చుకుంటారనుకుంటే... మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్ సమరం ఓటమితో ముగిసింది.
భారత్ ఓటమితో విరాట్ కోహ్లీ తీవ్రమైన నిరుత్సాహానికి గురైయాడు.. ఆ సమయంలో విరాట్‌కు ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ ఆనుష్క శర్మ అండగా నిలబడింది. విరాట్‌ను దగ్గరకు తీసుకుని ఎంతో ఉద్వేగంతో కౌగిలించుకుని ఓదార్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీమ్ ఇండియా ఓటమి తర్వాత అనుష్క కూడా గుండె పగిలినట్లు కనిపించింది. అయితే, మ్యాచ్ తర్వాత ఆమె భర్త విరాట్‌కు పూర్తి మద్దతుగా నిలిచి ధైర్యాన్ని నింపేలా ఓదార్చింది.నెటిజన్లు ఈ జంటపై ప్రేమను కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భర్తకు ఇలా సపోర్ట్ చేయడం ఎంతో అవసరమని మరోకరు తెలిపారు. బాలీవుడ్ నటి అనుష్క విరాట్‌కు మద్దతు ఇచ్చే విధానం క్రికెట్,సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ ఓటమిని పలువురు సెలబ్రిటీలు కూడా జట్టుకు తమ తిరుగులేని మద్దతును తెలిపారు. షారుక్ ఖాన్ కాజోల్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్, ఆయుష్మాన్ ఖురానా . ప్రతి ఒక్కరూ భారత్ ఓటమిపై తమ బాధను వ్యక్తం చేశారు. అయితే టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. అనుష్క శర్మ తదుపరి చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్' (Chakda 'Xpress) చిత్రంతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహింస్తున్నారు.
What a tragedy! @AnushkaSharma and @theathiyashetty must be devastated beyond words. Life's just so unfair, isn't it? 😔 pic.twitter.com/WcIBMJnUUH
— ⚡ai_Prabha⚡ (@_Prabhas2K01) November 19, 2023
Comments
Please login to add a commentAdd a comment