Australia Creates Record In T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. నవంబర్ 4న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 82 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ టార్గెట్‌ను ఫినిష్ చేసింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ధాటికి కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు సాధించగా, మ్యాక్స్‌వెల్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
స్కోర్లు:
బంగ్లాదేశ్- 73 (15)
ఆస్ట్రేలియా-78/2 (6.2)
చదవండి: T20 WC 2021 AUS Vs BAN: ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో..
Comments
Please login to add a commentAdd a comment