austrialia
-
అమల్లోకి కొత్త చట్టం.. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత విసిగిస్తే బాస్‌పై చర్యలే
ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్మెంట్ (రైట్ టు డిస్కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీస్ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్‌తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్‌లు ఉన్నాయి. -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్‌డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఓలా గుడ్‌బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్‌ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్‌లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్‌ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆస్ట్రేలియాలో అంబానీ వ్యాపారం, ఫోకస్ అంతా చిన్న కొడుకు బిజినెస్‌పైనే!
న్యూఢిల్లీ: బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్తో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చేతులు కలిపింది.తద్వారా భాగస్వామ్య సంస్థ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ ఆస్ట్రేలియాలో పునరుత్పాదక ఇంధనం, కర్బనాలు తగ్గించే పరికరాల తయారీకి ఉన్న అవకాశాలను అన్వేషించనుంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్.. రిలయన్స్‌తో కలసి ప్రత్యక్ష మూలధన పెట్టుబడి అవకాశాలు, కార్యకలాపాల ఏర్పాటు అవకాశాలను వెదికి పట్టుకోనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోలార్ సెల్స్, మాడ్యూల్స్, ఎనర్జీ స్టోరీజే బ్యాటరీలు, ఇంధన సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న గిగాఫ్యాక్టరీలకు సైతం పరికరాలను జేవీ సరఫరా చేయనుంది. ఇందుకు వీలుగా ఆర్ఐఎల్, బ్రూక్‌ఫీల్డ్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. వెరసి ఆ్రస్టేలియాలో ఇంధనపరమైన మార్పులకు జేవీ బూస్ట్ నివ్వనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. శుద్ధ ఇంధన పరికరాల స్థానిక తయారీ ఇందుకు తోడ్పాటునందించనున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎంఓయూపై రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. తమ సంస్థ (రిలయన్స్) మానవాళికి ప్రయోజనకరమైన, ప్రకృతికి అనుకూలంగా ఉండే క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ను రూపొందించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. -
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! కెప్టెన్‌గా బాబర్‌కు అవకాశం
ICC announces best XI of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో ఆదివారం(నవంబర్ 14)న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జట్టులో ఆరు దేశాల జట్లకు చెందిన ఆటగాళ్లకు స్ధానం దక్కింది. అదే విధంగా టీమిండియాలో ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్, సెమీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, పాకిస్తాన్, అధేవిదంగా శ్రీలంక,దక్షిణాఫ్రికా చెందిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జట్టుకు బాబర్ అజాంను కెప్టెన్‌గా సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది . ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ విద్వంసకర ఆటగాడు జోస్ బట్లర్‌కు ఓపెనర్లుగా చోటు దక్కింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంకు మూడో స్ధానంలో, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంకకు నాలుగో స్ధానంలో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్.. ఐదో స్ధానంలో చోటు దక్కించకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో ఇంగ్లండ్ ఆటగాడు మోయిన్ ఆలీ, శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగాకు స్ధానం దక్కింది. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపాను ఎంపిక చేశారు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్,అన్రిచ్ నోర్ట్జే చోటు దక్కింది. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని తీసుకుంది. కాగా ఈ జట్టును బిషప్ (కన్వీనర్), నటాలీ జర్మనోస్, షేన్ వాట్సన్, లారెన్స్ లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా), జోస్ బట్లర్(ఇంగ్లండ్, వికెట్ కీపర్), బాబర్ అజాం(పాకిస్తాన్, కెప్టెన్), చరిత అసలంక(శ్రీలంక),మారక్రమ్(దక్షిణాఫ్రికా),మోయిన్ అలీ(ఇంగ్లండ్), హసరంగా(శ్రీలంక),ఆడం జంపా,(ఆస్ట్రేలియా),జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా),ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) అన్రిచ్ నోర్ట్జే( దక్షిణాఫ్రికా) చదవండి: David Warner: ఫామ్‌లో లేడు.. ముసలోడు.. నెమ్మదిగా ఆడతాడు.. కంగ్రాట్స్.. -
టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా
Australia Creates Record In T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. నవంబర్ 4న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 82 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ టార్గెట్‌ను ఫినిష్ చేసింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ధాటికి కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు సాధించగా, మ్యాక్స్‌వెల్ ఒక్క వికెట్ పడగొట్టాడు. స్కోర్లు: బంగ్లాదేశ్- 73 (15) ఆస్ట్రేలియా-78/2 (6.2) చదవండి: T20 WC 2021 AUS Vs BAN: ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తలనొప్పికి 'యాప్' రాత
తల నొప్పితో బాధపడేవారికి శుభవార్త. తలనొప్పి ట్రీట్ మెంట్ కోసం కొత్త మార్గాన్ని అన్వేషించిన సైంటిస్తులు కొత్త యాప్ ను డెవలప్ చేశారు. తలనొప్పి కారణంగా ఎంత మొత్తంలో బాధను రికార్డు చేయడానికి యాప్ దోహదపడుతుందని సైంటిస్టులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ హెల్త్ ఇనిస్టిట్యూట్ బిహేవియరల్ బేసిస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్ అనే సంస్థకు సంబంధించిన ప్రొఫెసర్ పాల్ మార్టిన్ అధ్యయనంలో భాగంగా యాప్ వాడినట్టు తెలిసింది. తలనొప్పితో బాధపడేవారు ఉపశమనం పొందేందుకు లర్నింగ్ టు కోప్ విత్ ట్రిగ్గర్స్ (ఎల్ సీటీ) అనే విధానాన్ని మార్టిన్ డిజైన్ చేశారు. ఎల్ సీటీ తోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానాన్ని ఉపయోగించినట్టు వెల్లడించారు. అలసట, శబ్ద కాలుష్యం, కలుషిత ఆహార పదార్థాల కారణంగా వచ్చే తలనొప్పి తీవ్రతను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ హెడెక్ డైరీలో డేటాను నిక్షిప్తం చేస్తుందని శాస్త్రజ్క్షులు తెలిపారు. రోజువారి తలనొప్పి తీవ్రత రేటింగ్ ఆధారంగా బాధను అరికట్టేందుకు చికిత్సను డిజైన్ చేసే అవకాశం ఉంటుందన్నారు.