
న్యూఢిల్లీ: బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) చేతులు కలిపింది.తద్వారా భాగస్వామ్య సంస్థ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది.
ఈ జేవీ ఆస్ట్రేలియాలో పునరుత్పాదక ఇంధనం, కర్బనాలు తగ్గించే పరికరాల తయారీకి ఉన్న అవకాశాలను అన్వేషించనుంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్.. రిలయన్స్‌తో కలసి ప్రత్యక్ష మూలధన పెట్టుబడి అవకాశాలు, కార్యకలాపాల ఏర్పాటు అవకాశాలను వెదికి పట్టుకోనుంది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోలార్ సెల్స్, మాడ్యూల్స్, ఎనర్జీ స్టోరీజే బ్యాటరీలు, ఇంధన సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న గిగాఫ్యాక్టరీలకు సైతం పరికరాలను జేవీ సరఫరా చేయనుంది.
ఇందుకు వీలుగా ఆర్‌ఐఎల్, బ్రూక్‌ఫీల్డ్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. వెరసి ఆ్రస్టేలియాలో ఇంధనపరమైన మార్పులకు జేవీ బూస్ట్ నివ్వనున్నట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. శుద్ధ ఇంధన పరికరాల స్థానిక తయారీ ఇందుకు తోడ్పాటునందించనున్నట్లు తెలియజేసింది.
ఈ సందర్భంగా ఎంఓయూపై రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. తమ సంస్థ (రిలయన్స్) మానవాళికి ప్రయోజనకరమైన, ప్రకృతికి అనుకూలంగా ఉండే క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ను రూపొందించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.