ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.
గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్‌మెంట్ (రైట్ టు డిస్‌కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.
పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీస్ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్‌తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment