new act
-
ఉగ్ర ముద్ర తొలగించేలా.. పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది. రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు. రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. సిరియాలో ఆరు దశాబ్దాల అసద్‌ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
ఒక హైడ్రా.. ఆరు చట్టాలు!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు చట్టాలను సవరించడం ద్వారా ‘హైడ్రా’కు ప్రత్యేక అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. భూ ఆక్రమణల చట్టం–1905, వాల్టా, ల్యాండ్ రెవెన్యూ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, మున్సిపాలిటీస్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టాలను సవరించడం ద్వారా.. కీలక అధికారాలను హైడ్రాకు బదలాయించాలని భావిస్తోంది. ఆ చట్టాల సవరణ కోసం ప్రతిపాదనలు ్చపంపాలని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. ఆ శాఖలు వెంటనే ప్రతిపాదనలను పంపాయని తెలిసింది. అయితే ఈ సవరణ ప్రతిపాదనలన్నింటినీ కలిపి చట్టం చేయాలా? ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే ఈ సవరణలను అమలు జరపాలా? అన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. చట్ట సవరణలు కాకుండా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తే బాగుంటుందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతానికి సహాయకారి మాత్రమే..ఆక్రమణల కూల్చివేత విషయంలో ‘హైడ్రా’ప్రస్తుతానికి ప్రభుత్వ శాఖలకు సహాయకారిగా మాత్రమే ఉంది. ఆక్రమణల నిర్ధారణ, నోటీసులివ్వడం, చర్యలు తీసుకోవడం, కూల్చివేయడం వంటి అధికారాలేవీ హైడ్రాకు దఖలు పడలేదు. ప్రభుత్వ శాఖలకు అనుబంధంగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు చట్టాలను సవరించి ఈ అధికారాలన్నీ నేరుగా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటికే చట్ట సవరణ ప్రతిపాదనలను పంపింది. ఆక్రమణల విషయంలో నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పటివరకు కేవలం తహసీల్దార్‌కు మాత్రమే ఉండగా.. ఇకపై తహసీల్దార్‌తోపాటు హైడ్రాలోని అ«దీకృత అధికారికి కూడా అధికారాలను దఖలు పరుస్తూ రెవెన్యూ చట్టంలో సవరణను ప్రతిపాదించారు.లేదంటే రెవెన్యూ అదీకృత అధికారిని హైడ్రాలోకి తీసుకోవాలని సవరణ ప్రతిపాదనల్లో సూచించినట్టు సమాచారం. అయితే హైడ్రాకు అధికారాల బదలాయింపు కోసం ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేయాలా? అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదం ద్వారా చట్టం చేయాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ నెల 20వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. స్పష్టత కోసమే ప్రత్యేక చట్టం ‘హైడ్రా’ మనుగడకు ప్రత్యేక చట్టమే ఉపయోగపడుతుంది. చట్టాలకు సవరణలు, ఆ సవరణలతో మరో చట్టం చేసే దాని కంటే హైడ్రాకు ప్రత్యేకంగా చట్టం చేసి మార్గదర్శకాలు రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావు. గందరగోళం ఉండదు. న్యాయపరమైన చిక్కులు రావు. ఎన్ఫోర్స్మెంట్తో పాటు చర్యలు తీసుకునే ప్రక్రియ మొత్తాన్ని ఈ చట్టంలో రూపొందించుకోవచ్చు. మరోవైపు చట్టబద్ధత ద్వారా అధికారాన్ని ఏ సంస్థకు బదలాయించినా ఆ సంస్థ బాధ్యత మరింత పెరుగుతుంది. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు -
అమల్లోకి కొత్త చట్టం.. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత విసిగిస్తే బాస్‌పై చర్యలే
ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్మెంట్ (రైట్ టు డిస్కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీస్ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్‌తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్‌లు ఉన్నాయి. -
ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : గత ఏడాది అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పసరి చేసిందని సీఎస్ స్పష్టంచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణాల నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి.. ఇక కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజి్రస్టార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారన్నారు. ఏ అథారిటీకైనా ఈ డేటా కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరముంటుందని ఆయన తెలిపారు. జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్టు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ల డేటాబేస్లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అన్ని జననాలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు నివేదించాల్సి ఉందని, ఇందులో జాప్యంలేకుండా సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎస్ కలెక్టర్లను కోరారు. -
పాత మూస... కొత్త చట్టం
మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది. కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది. భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి. అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం. అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది. అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది. కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు. నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది. చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం. -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్) పునర్ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్ఈజెడ్లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్’’ (డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రోత్సాహకాలు ఇవీ... ఎస్ఈజెడ్లో ఒక యూనిట్ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్టీ (ఇంటిగ్రేడెట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు, దేశీయ టారిఫ్‌లకు సంబంధించి ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్‌లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్ సమర్పణ సందర్భంగా లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎకానమీలో కీలకపాత్ర... దేశంలో ఎగుమతి కేంద్రాలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్ చట్టం రూపొందింది. 2022 జూన్ 30 నాటికి కేంద్రం 425 ఎస్ఈజెడ్ డెవలపర్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది. -
అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను కేంద్ర మంత్రివర్గం బుధవారం అమోదించింది. అద్దె ఇళ్ల కొరతను పరిష్కరించేందుకు కొత్త వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె ఇళ్ల వ్యాపార రంగానికి నాంది పలికింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని పంపనుంది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం తోపాటు, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా అద్దెగృహాలకు సంబంధించి చట్టపరమైన చట్రాన్నిసరిదిద్దడంలో సహాయపడుతుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాలకు తగిన అద్దె హౌసింగ్ స్టాక్‌ను రూపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని, తద్వారా నిరాశ్రయుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.అద్దె గృహాలను క్రమంగా అధికారిక మార్కెట్ వైపుకు మార్చడం ద్వారా, మగృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 లో కేంద్రం "మోడల్ అద్దె చట్టం" ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అధికారిక అద్దె ఒప్పందం అవసరం, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, అద్దె పెరుగుదల రేటు, తొలగింపుకు కారణాలు వంటి అంశాలను ఇది పరిష్కరిస్తుంది. అలాగే అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా, అద్దెదారు ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ చట్టం ప్రకారం గరిష్టంగా రెండు నెలలు. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. చదవండి: Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
‘కొత్త’ ఢిల్లీ
అధికార వికేంద్రీకరణ అవసరం గురించి, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రాముఖ్యత గురించి గతంతో పోలిస్తే అందరిలోనూ చైతన్యం పెరిగిన వర్తమానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారాలకు కోత పడింది. ఇకపై అక్కడి ముఖ్యమంత్రి కార్యనిర్వాహకపరమైన అన్ని చర్యలకూ లెఫ్టినెంట్ గవ ర్నర్(ఎల్జీ) నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సివుంటుంది. అసెంబ్లీ అయినా అంతే... ఎలాంటి శాసనాలు చేయాలన్నా ఎల్జీ ముందస్తు అనుమతి అవసరం. అసెంబ్లీ అనుబంధ సభా సంఘాలకు కూడా ఇది వర్తిస్తుంది. గత నెలలో పార్లమెంటు ఆమోదించిన జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంత (సవరణ) చట్టం మంగళవారంనుంచి అమల్లోకొచ్చింది. ఇక ఢిల్లీలో ‘ప్రభుత్వం’ అంటే ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదు... లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే! అసెంబ్లీ ఇకపై తనకు సంబంధించిన పాలనాపరమైన అన్ని నిబంధనలకు ఎల్జీ ఆమోదం పొందాలి. విచారణలైనా అంతే. ఇప్పుడున్న సభా సంఘాలు రద్దవుతాయి. ఎన్నికైన ప్రజా ప్రతి నిధులను సంప్రదించకుండా ఎల్జీ ఇకపై సొంతంగా ఏ అధికారినైనా బదిలీ చేయొచ్చు. నిపుణులు చెబుతున్న ప్రకారం ఇకనుంచి ఢిల్లీ మంత్రివర్గం ఎలాంటి ప్రాజెక్టుల్ని అమలు చేయాలన్నా, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నా ముందుగా ఎల్జీ అనుమతి తీసుకోవాలి. ప్రజలెన్నుకునే ప్రభుత్వానికి కాకుండా పైనుంచి నియామకం అయిన ఎల్జీకే అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పార్లమెంటులో ఈ బిల్లు చర్చకొచ్చినప్పుడే విపక్షాలు తీవ్రంగా విమర్శిం చాయి. ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా వుండే చట్టసభను కాదని, కేంద్రం నిర్ణయించే ఎల్జీకే ప్రాధాన్యతనివ్వడం అప్రజాస్వామికమని ఆగ్రహించాయి. చట్టసభలో పాలకపక్షానికి మెజారిటీ వుండొచ్చు. తనకు తోచిన ఏ నిర్ణయానికైనా ఆమోదముద్ర వేయించుకోవచ్చు. ఏ నిర్ణయమైనా ప్రజలకు నచ్చేలా, వారి శ్రేయస్సుకు, సంక్షేమానికి దోహదపడేలా వుండటం ముఖ్యం. కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో అధికార వికేంద్రీకరణ అవసరం అందరికీ బాగా తెలుస్తోంది. ముఖ్యంగా మరణమృదంగం మోగిస్తున్న ఢిల్లీలో ఎక్కడికక్కడ నిర్ణ యాలు తీసుకోలేని అశక్తత బయటపడుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సీఎంల సమావేశంలో చేతులెక్కి మొక్కి అడగవలసివచ్చింది. ప్రతి దానికీ ‘పైనుంచి’ ఆదేశం రావాలని, ప్రతి అడుగుకూ ‘పైవారి’ అనుమతి అవసరమని అనుకుంటే ఒక్కటీ ముందుకు కదలదు. ప్రతి అంచెలోనూ ఎవరి అధికారాలేమిటో, పరిమితులేమిటో నిర్ణయించటం... సొంత చొరవతో పనిచేసేలా ప్రోత్సహిం చటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. అందువల్ల అన్ని వ్యవస్థలూ చురుగ్గా తయారవుతాయి. కొత్త ఆలోచనలు, ఆచరణ రూపుదిద్దుకుంటాయి. వాటివల్ల అంతిమంగా మంచే తప్ప చెడు జర గదు. ఢిల్లీ విషయమే తీసుకుంటే... అక్కడ కేజ్రీవాల్‌కు ముందు చాలా ప్రభుత్వాలొచ్చాయి. అవి జన సంక్షేమ పథకాలు అమలు చేశాయి. జనం మెచ్చినప్పుడు అవి తిరిగి అధికారంలోకొచ్చిన సంద ర్భాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ అక్కడి విద్యా సంస్థలను ఇప్పుడున్నంత అద్భుతంగా తీర్చి దిద్ద లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంతో నిబ్బరంతో, ఆత్మ విశ్వాసంతో చదువు కుంటూ ఔరా అనిపిస్తున్నారు. కలిగినవారి పిల్లలతో పోటీపడి ఉన్నత శ్రేణి విద్యాసంస్థలకు ఎంపిక వుతున్నారు. అలాగే బస్తీ క్లినిక్‌లు వచ్చాయి. సాధారణ ప్రజానీకానికి సకాలంలో మంచి వైద్య సల హాలు లభిస్తున్నాయి. వారు ప్రాథమిక దశలో నిర్లక్ష్యం చేసి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం తప్పుతోంది. కానీ ఇవే ప్రతిపాదనలను ఎల్జీ అనుమతి కోసం పంపి, ఆయనడిగే వివర ణలకు జవాబిచ్చి, ఆమోదం కోసం ఎదురుచూస్తే ఎన్నాళ్లు పడుతుంది? తాము పంపిన ఫైళ్లపై ఎల్జీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని కేజ్రీవాల్ లోగడ వివిధ సందర్భాల్లో ఆరో పించారు. అందులో టీచర్ల బదిలీలు, వారి పదోన్నతులు వగైరాలు వున్నాయి. ఇక ప్రజా సంక్షేమ పథకాలు సైతం వేచిచూడటంలోనే వుండిపోతే ఎన్నికైన ప్రభుత్వం తాను అనుకున్నది సాధించ గలుగుతుందా? హామీలను నెరవేర్చగలుగుతుందా? ఈసారి జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు ఎలావుంటాయి? తాము గెలిస్తే ఫలానా పథకాలు, కార్యక్ర మాలు అమలు చేస్తామని హామీ ఇవ్వాలా లేక వాటికోసం ఎల్జీని ఒప్పిస్తామని హామీ ఇవ్వాలా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొలువుదీరి వుంటుంది గనుక... అక్కడ విదేశీ రాయబార కార్యా లయాలు, అతి కీలకమైన పాలనా కేంద్రాలు వుంటాయి గనుక దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా అక్కడుండే ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టడం అసాధ్యమన్న వాదనతో విభేదించే వారు ఉండకపోవచ్చు. ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీ అసెంబ్లీ చట్టాలు చేసుకోవచ్చని రాజ్యాంగంలోని 239 ఏఏ అధికరణ చెబుతోంది. అయినా ముఖ్యమంత్రికీ, ఎల్జీకి గతంలో వివిధ అంశాలపై వివాదాలేర్పడటంతో ఎవరి అధికారాలేమిటో సుప్రీంకోర్టు తెలిపింది. కేబినెట్ సలహాలు, సూచనలతోనే ఎల్జీ నడుచుకోవాలంటూనే... ఏ నిర్ణ యాన్నయినా ఆయన తనకున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించవచ్చని తెలిపింది. ప్రతి దానిలోనూ జోక్యం తగదన్నది. ఈ విషయంలో మరింత స్పష్టతనీయాల్సింది పోయి కొత్త చట్టం పూర్తిగా ఎల్జీకే అధికారాలు కట్టబెట్టింది. ఈమాత్రం దానికి ఇక అక్కడ ప్రభుత్వం ఎందుకు... అసెంబ్లీ ఎందుకు? -
Delhi Lieutenant Governor: ఢిల్లీకి ఎల్జీనే బాస్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇన్చార్జ్గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. జీఎన్సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఆప్ సహా పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధమని విమర్శించాయి. తాజా నోటిఫికేషన్‌తో చట్టంలోని నిబంధనలు ఈనెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఎల్జీని కేంద్రం నియమిస్తునందున, ఇకపై దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం వైఫల్యం చెందిన వేళ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా విజృంభణపై మంగళవారం ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ ప్రభుత్వం నామమాత్రమే.. జీఎన్సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నామమాత్రంగా మిగలనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తాజా ఆదేశాలతో ఇకపై ఎల్జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్ ప్రభుత్వం ఎల్జీ అనుమతితోనే అడుగులు వేయాల్సిఉంటుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎల్జీ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ ఎల్జీ అధికారాలు భిన్నమైనవని అధికారులు వివరించారు. ఇప్పటివరకు అధికార పరిధిపై ఎల్జీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న సందిగ్ధాలను తాజా చట్టం నివారిస్తుందని చెప్పారు. -
తెలంగాణలో రెవెన్యూ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది. విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్)ని జారీ చేయలేదు. సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్–5 (బీ) మేరకు అప్పీల్ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్‌పై రూల్స్ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు. దరఖాస్తులకు మోక్షం ఎలా? కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్‌డివిజన్ అర్జీలు పెం డింగ్‌లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 38 (ఈ), లావణి, ఓఆర్సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంటికే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చట్టానికి ప్రభుత్వం పదునుపెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా పాలకవర్గాలనే రద్దు చేసేలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019లో నిబంధనలను పొందుపరుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, నిధులు పక్కదారి పట్టినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా పురపాలక చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముసాయిదా ప్రతులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయశాఖ సూచనలు, సలహాల అనంతరం ముసాయిదా చట్టం కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది. సమర్థంగా పనిచేయకపోతే... పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మున్సిపాలిటీల్లో అవినీతికి ముకుతాడు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కొరడా ఝళిపించాలని, అవినీతికి పాల్పడ్డట్లు తేలితే పాలకవర్గాలను రద్దు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కొత్త చట్టం రూపకల్పనపై కసరత్తు చేసిన నిపుణుల కమిటీ... సమర్థ పాలన అందించలేకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినా సదరు మున్సిపాలిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ నూతన చట్టాన్ని రూపొందించింది. దీంతో పాలకవర్గం రద్దు కాగానే.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు (వార్డు సభ్యులు), కో ఆప్షన్ సభ్యుల పదవి కూడా ఊడనుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ పాలకవర్గానికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే రద్దయిన తేదీ నుంచి ఆరు నెలల్లో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గం స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను దూరంగా ఉంచనుంది. పురపాలకశాఖ విచక్షణ మేరకు స్థానిక కమిషనర్ లేదా ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించేలా చట్టంలో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరేళ్లపాటు అనర్హత వేటు... నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తేలితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. చట్టంలోని నిబంధనలను పాటించకపోయినా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే విధంగా చట్టం ఉండనుంది. అదేవిధంగా ఒకసారి ఉద్వాసనకు గురైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు ఆ తేదీ నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. వార్డుల హేతుబద్ధీకరణ! సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు.. వార్డుల ఏర్పాటులో హేతుబద్ధత పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 1,500 నుంచి 15 వేల వరకు వార్డులు ఉన్నాయి. అయితే నిర్దేశిత జనాభా ప్రాతిపదికన కాకుండా అడ్డగోలుగా విభజించడంతో అభివృద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో వార్డుల వర్గీకరణపైనా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్ల సంఖ్యను ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. -
గ్రీన్‌కార్డ్ కోటా ఎత్తేస్తే..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు మంచిరోజులు రానున్నాయి. అమెరికా కాంగ్రెస్ ముందున్న ‘ఫెయిర్‌నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్’బిల్లు చట్టరూపం దాల్చితే ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారత సాంకేతిక నిపుణులు వచ్చే మూడేళ్లలోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. దాదాపు 3 లక్షల మంది భారతీయ టెకీలు దశాబ్దం కాలంగా హెచ్1–బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్నారు. ఏటేటా హెచ్1–బీ కోసం దరఖాస్తుచేయడం, అది ఆమోదం పొందేదాకా ఒత్తిడికి గురవడం వంటి సమస్యలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్, చైనా తదితర దేశాలనుంచి వచ్చి అమెరికాలో వర్క్ వీసాలపై పని చేస్తున్న లక్షలాది మందికి మూడేళ్లలోనే శాశ్వత నివాసం దక్కుతుందని న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ లభించని కారణంగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, తాజా బిల్లును ఆమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే ఐటీ నిపుణులకు మంచి వేతనాలు లభిస్తాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఈ ఏడాది జూన్ నాటికి గ్రీన్‌కార్డుల జారీలో కోటా విధానం రద్దు కావచ్చని అక్కడి వార్తా సంస్థలు చెపుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి దరఖాస్తులకు మోక్షం అమెరికాలో శాశ్వత నివాసానికి దేశాలవారీ కోటా అమలు చేస్తుండటంతో భారతీయులు పదేళ్ల నుంచి వేచిచూడాల్సి వస్తోంది. 2009 నాటి దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి క్లియర్ చేసే పనిలో యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఏటా 1.40 లక్షల మందికి గ్రీన్‌కార్డులు జారీచేస్తుంది. ఈ లెక్కన భారతదేశానికి చెందిన 9,800 మందికి మాత్రమే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. భారత్, చైనా కాకుండా అమెరికాలో హెచ్1–బీ, ఇతర వృత్తి నిపుణుల వీసాపై పని చేస్తున్న ఇతరదేశాల వారికి సులువుగా గ్రీన్‌కార్డ్ వస్తోంది. 2000కు ముందు భారతీయులకు మూడునాలుగేళ్లలోనే గ్రీన్‌కార్డు దక్కేది. కానీ, అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున్న వారి సంఖ్య పెరగడంతో.. 2002 నుంచి గ్రీన్‌కార్డుల కోసం వేచి చూసే భారతీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. యుఎస్సీఐఎస్ అందించిన సమాచారం ప్రకారం గతేడాది మార్చి నాటికి 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 3,06,601 మంది భారతీయులే కావడం గమనార్హం. 2018 డిసెంబర్ నాటికి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల సంఖ్య మరో 59 వేలు పెరిగి 4,54,025కు చేరుకోగా.. ఇందులో 3,35,650 మంది భారతీయులే అందులోనూ మెజారిటీ ఐటీ నిపుణులే. చట్టరూపం దాల్చితే ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ముందున్న ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే మొదటి ఏడాదిలోనే దాదాపు లక్ష మంది భారతీయ ఐటీ నిపుణులు శాశ్వత నివాస హోదా పొందుతారు. ఈ లెక్కన మరో మూడునాలుగేళ్లలో గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయులందరికీ.. శాశ్వత నివాస హోదా దక్కడం దాదాపు ఖాయమే. 2018 నాటికి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ 2022నాటికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. అయితే, 2015 నుంచి ఏటా 2లక్షల మంది అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెడుతున్న నేపథ్యంలో వారందరికీ వర్క్ వీసాలు లభిస్తే 2025 నుంచి మళ్లీ బ్యాక్లాగ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం లేదా శాశ్వత నివాస హోదా కోసం అమెరికా వెళ్లాలనుకుంటే అసాధారణమైన తెలివితేటలుండాలని వారంటున్నారు. జీఆర్ఈ 312 కంటే ఎక్కువ, టోఫెల్ స్కోర్ 100 దాటేవారికి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయని, 310 అంతకంటే తక్కువ జీఆర్ఈ, 90 కంటే తక్కువ టోఫెల్ స్కోర్‌తో వస్తున్న వారు ఇబ్బందులు పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 25ఏళ్లు భారత్‌లోనూ ఐటీ ఉద్యోగాలకు ధోకా ఉండదని, ఖర్చులు తగ్గించుకోవడం కోసం అనేక ముఖ్యమైన కంపెనీలు మానవ వనరులు అత్యధికంగా ఉన్న భారత్‌లో కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఫీచర్డ్ ఆన్ స్లేట్ (అమెరికా) ప్రెసిడెంట్ ఇగోర్ మార్కోవ్ అభిప్రాయపడ్డారు. మంచి వేతనాలొస్తాయ్! శాశ్వత నివాస హోదా దక్కితే కంపెనీలపై ఆధారపడే అగత్యం తప్పుతుందని, మంచి వేతనాలు లభిస్తాయని ఆమెరికా ఆర్థిక నిపుణులంటున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆర్థిక పరిపుష్టతతోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు స్పాన్సర్ చేస్తేనే గ్రీన్‌కార్డ్ దరఖాస్తును యుఎస్సీఐఎస్ ఆమోదిస్తుంది. ఉద్యోగి ఏ కారణాల వల్ల వైదొలగినా అతని గ్రీన్‌కార్డ్‌ను వెనక్కి తీసుకునే అధికారం కంపెనీలకు ఉంటుంది. దీంతో ఇబ్బంది ఎందుకన్న భావనలో ఐటీ నిపుణులు ఒకే సంస్థలో తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కసారి శాశ్వత నివాస హోదా వస్తే సదరు ఉద్యోగి స్వేచ్చగా ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
గోరక్షక్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-
ఆ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కొంత మంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ప్రజలపై దాడిచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి వీల్లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దాడులను అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
యూజీసీ ఇక గతం..
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు శ్రీకారం చుట్టేలా బుధవారం కేంద్రం నూతన చట్ట ముసాయిదాను ప్రతిపాదించింది.యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కానుంది. ఇందుకు మార్గం సుగమం చేస్తూ యూజీసీ చట్టం, 1956ను తొలగిస్తూ నూతన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. నూతన ముసాయిదా చట్టంపై జులై 7లోగా విద్యాసంస్థలు, మేథావులు, నిపుణులు, తల్లితండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలను పంపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా సంస్థలకు మరింత ప్రతిపత్తి కల్పించే నియంత్రణ వ్యవస్థలను సంస్కరించే క్రమంలో ముసాయిదా చట్టం తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, మరిన్ని అధికారాలను కల్పించడం వంటి ఆశయాలతో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలో ప్రభుత్వం మార్పులు చేపట్టిందని చెప్పారు. యూజీసీ చట్టం స్ధానంలో ఉన్నత విద్యా కమిషన్ చట్టం 2018ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దేశంలో కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలు ఇక ఉన్నత విద్యా కమిషన్ పరిధిలో ఏర్పాటవుతాయి. కాగా, విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చడంలో యూజీసీ కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఇక ఈ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషన్ తలకెత్తుకోనుంది. -
కులాంతర వివాహాల రక్షణకు కొత్త చట్టం
సాక్షి, ముంబై: కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులపై జరుగుతున్న దాడులను, పరువు హత్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపకల్పన చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది. దంపతులకు రక్షణ కల్పించి, ప్రోత్సాహకాలు అందించే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోల్ తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల పిల్లలకు రిజర్వేషన్లు, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తోందని, ఢిల్లీలోని అంబేడ్కర్ ఫౌండేషన్ 2.5 లక్షల నగదు అందిస్తోందని తెలియజేశారు. మరో రెండు నెలల్లో చట్టం ముసాయిదాను సిద్ధం చేస్తామని కమిటీ చైర్మన్ సీఎస్ తూల్ ప్రకటించారు. దేశంలో కులాంతర వివాహాం చేసుకున్న జంటలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీఎస్ తూల్ అభిప్రాయపడ్డారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం పరువు హత్యల్లో మహారాష్ట్ర, దేశంలో నాలుగో స్థానంలో ఉంది. 2016 లో జరిపిన సర్వేలో మహారాష్ట్రలో 69 కేసులు నమోదు కాగా, ఎనిమిది మందిని పరువు హత్య పేరుతో హతమార్చినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. -
గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలతోపాటు పంచాయతీలకు నిధులు పెంచుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. శాసనసభలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ పద్దులపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. శాసనసభ్యుల గృహాలు సిద్ధం: తుమ్మల రాష్ట్ర శాసనసభ్యుల కోసం నిర్మించిన 120 గృహాల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల కోసం 44 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం కొత్తగూడెం 720 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నా యని విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం శాసనసభ శుక్రవారం ఆర్అండ్బీ, నీటిపారు దల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పురపాలక, రెవెన్యూ, రవాణా, ఎౖMð్సజ్ శాఖల బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపింది. -
తెలంగాణకు కొత్త వక్ఫ్ చట్టం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వక్ఫ్ చట్టానికి అనుగుణంగా తెలంగాణకు కొత్త వక్ఫ్ చట్టాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులన్నింటినీ వెంటనే గుర్తించి, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ భూములకు ప్రహరీ/కంచె నిర్మించాలని, వాటిని కలెక్టర్ల స్వాధీనంలో ఉంచాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వక్ఫ్ భూములను గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ వక్ఫ్ బోర్డు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. గురువారం ప్రగతి భవన్లో వక్ఫ్ బోర్డు సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు ఎక్కుడున్నాయో, ఎలా ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని ఆదేశించారు. కబ్జాలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం ఖరారు చేయాలని, ఈ విషయంలో ప్రభు త్వం అండగా ఉంటుందని వెల్లడించారు. రెవెన్యూ శాఖ, వక్ఫ్ బోర్డు మధ్య వివాదం ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూమి కాని, ఆస్తి కాని ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగితే ఎప్పటికైనా వక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని సీఎం అన్నారు. కలెక్టర్లు సహకరించాలి వక్ఫ్ ఆస్తుల రక్షణకు 2 కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఒక కమిటీ రికార్డుల నిర్వహణను, మరో కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులను గుర్తించి, రక్షించే చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు. వక్ఫ్ భూముల రక్షణ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వక్ఫ్ బోర్డు పనితీరు ఎలా ఉండాలో, బోర్డు విధి విధానాలు ఎలా ఉండాలో స్పష్టత రావాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని సూచించారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండీ సలీం, సీఈఓ మన్నన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, బోర్డు సభ్యులు మజామ్ ఖాన్, అక్బర్ నిజాముద్దీన్, సయ్యద్ జకీరుద్దీన్, ఇక్బాల్, అన్వర్, నిసాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం?
సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం ఒకదాన్ని రూపొందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన సందేశాలను సోసల్ మీడియా ద్వారానే విస్తృతంగా వ్యాపింపజేస్తున్నారని, అందువల్ల కొత్త చట్టంతో దాన్ని నియంత్రించాలని సుప్రీం చెప్పింది. సోషల్ మీడియాను, ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తున్నారని, ముఖ్యంగా వివాదాస్పద సెక్షన్ 66ఎను సుప్రీంకోర్టు రద్దుచేసిన తర్వాత ఇది మరీ ఎక్కువైందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాను రేప్ కేసులో నిందితుడిగా ఉన్నానంటూ ఇటీవల వాట్సాప్‌లో ఓ సందేశం విపరీతంగా వ్యాపించిందని సీనియర్ న్యాయవాది ఎల్. నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తనకు దాని గురించి చెప్పడం, పలువురు వ్యక్తులు ఫోన్ చేయడంతోనే తనకు దానిగురించి తెలిసిందన్నారు. తన గురించి కూడా సోషల్ మీడియాలో ఓ తప్పుడు సందేశం విపరీతంగా వెళ్లిందని మరో సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ కూడా కోర్టుకు తెలిపారు. వాళ్ల వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. మరీ ఇలాంటి అతి స్వేచ్ఛ ఇస్తే సోషల్ మీడియాలో జనం ఇలా ప్రమాదకరమైన ప్రచారాలకు ఒడిగడుతున్నారని, ఇలాంటి చర్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని చేయాల్సిందేనని తెలిపింది. -
ప్రయోగాలపై కొత్త చట్టం
నిరుపేదల, నిరక్షరాస్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఔషధ ప్రయోగాలకు సంబంధించి ఎట్టకేలకు సమగ్రమైన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానున్నదన్న వార్త అనేకమందికి ఊరట కలిగిస్తుంది. ఈ ప్రయోగాల విష యంలో నిర్దిష్టమైన నిబంధనలు లేకపోవడంవల్ల ఆచరణలో ఎన్నో సమస్యలు తలె త్తుతున్నాయి. ప్రయోగాలు వికటించినప్పుడు ఫిర్యాదులొస్తే తప్ప అసలు అలాం టివి నిర్వహిస్తున్నారన్న సంగతి ప్రభుత్వాలకు తెలియడంలేదు. ఆ ప్రయోగాల్లో మరణాలు సంభవించినప్పుడు లేదా దుష్ఫలితాలు ఏర్పడినప్పుడు మీడియాలో వెల్లడవుతాయి. బ్రిటిష్ వలసపాలకుల కాలంలో రూపొందిన డ్రగ్స్ అండ్ కాస్మొ టిక్స్ చట్టం నిబంధనలు ఔషధ ప్రయోగాలకు సహకరించడంలేదన్న ఉద్దేశంతో 2005లో దాన్ని సవరించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ సంస్థలు మన దేశంలో ప్రయోగాలకు క్యూ కట్టాయి. ఈ సవరణకు ముందూ తర్వాతా ఔషధ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు బేఖాతరవుతూనే ఉన్నాయి. మూడేళ్లక్రితం సుప్రీంకోర్టులో ఈ తరహా ఘటనలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయ్యాకగానీ ఇందులోని తీవ్రత బయటి ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2005-12 మధ్య 475 ప్రయోగాల పర్యవ సానంగా 2,644మంది మరణించగా...11,972మందిలో తీవ్ర దుష్ర్పభావాలు కనబడ్డాయి. ఈ ఉదంతాలపై విచారణ జరిగాక అందులో 80 మరణాలు ఔషధ ప్రయోగాలకు సంబంధించినవని తేల్చారు. ఇక రోగులు తీవ్ర దుష్ర్పభావాలకు లోనైన కేసుల్లో దాదాపు 500 కేసులు ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని నిర్ధారిం చారు. అయితే, ఈ కేసులన్నిటిలోనూ విచారణ సవ్యంగా సాగిందని చెప్పలేం. కేన్సర్‌కు దారితీసే హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) నివారణకు రూపొం దించిన వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడటం కోసం 2010లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో 24,777మంది యువతులను ఎంచుకున్నప్పుడు ఇలాంటి సమస్యే తలెత్తిం ది. వ్యాక్సిన్‌ను తీసుకున్నవారిలో ఏడుగురు యువతులు మరణించారని తెలియ గానే ఆపేశారు. అనంతరం ఔషధ నియంత్రణ జనరల్ మరికొన్న మార్గదర్శ కాలను జారీచేశారు. అయినప్పటికీ సమస్య ఎప్పటిలానే ఉండటంవల్ల, కేంద్రం నుంచి సరైన స్పందన లేని కారణంగా 2012లో పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టులో పిల్ దాఖలుచేశాయి. ఒకపక్క సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగానే 2013-14 మధ్య మరో 370మంది ఔషధ ప్రయోగాల తర్వాత చనిపోయారు. ఇందులో 21 చావులు మాత్రమే ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కనుక ఆ కేసుల్లో మాత్రమే సవరించిన నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహా రం దక్కింది. చిత్రమేమంటే ప్రయోగాలు వికటించినప్పుడు బాధిత కుటుంబా లకు నామమాత్రంగా ఆయా ఔషధ సంస్థలతో పరిహారం ఇప్పించడం తప్ప ఆ సంస్థలపై చర్య తీసుకొనేందుకు అవసరమైన చట్ట నిబంధనలు లేవు. ఈ లోపాలు ఔషధ సంస్థలకు వరాలుగా మారాయి. అసలు ఔషధ ప్రయోగాలకు సంబంధిం చిన నిబంధనలే సరిగా లేవనుకుంటే...వాటి ప్రమేయంలేని ప్రయోగాలు కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మరోపక్క ఆ నిబంధనల విషయంలో ఏం చెబుతా రని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు చాన్నాళ్లపాటు కేంద్రంనుంచి సరైన జవాబు లేదు. రాష్ట్రాలను అడిగి చెబుతామని అనడం తప్ప ఆ విషయంలో ఎలాంటి ప్రగతీ లేదు. ఒక దశలో సుప్రీంకోర్టు తీవ్ర అసహసనం వ్యక్తంచేసి తానే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి దాని సిఫార్సుల ఆధారంగా కొన్ని మార్గదర్శకాలను రూపొం దించి కొత్త చట్టం వచ్చేవరకూ ఆ మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని ప్రకటిం చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెం టరీ స్థాయీ సంఘం నిరుడు సమర్పించిన నివేదిక భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖల తీరుతెన్నుల్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఔషధ ప్రయోగాల వెనక ఓ పెద్ద వ్యాపారం ఉంది. దాదాపు రూ. 3,500 కోట్ల ఈ వ్యాపారం ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతుంటుందని అంచనా. ఇందులో ప్రయోగాలకు సిద్ధపడేవారికి నామమాత్రంగా దక్కుతుంది. ఆ ప్రయోగాల నిర్వహణ బాధ్యత తీసుకునేవారికీ, దళారులకూ అధిక భాగం వెళ్తుంది. ఇక్కడి జనాభాలో జన్యు వైవిధ్యం ఉన్నదని ఔషధ సంస్థలు చెప్పే మాట నిజమే కావొచ్చు గానీ... పర్యవేక్షణ సరిగా లేకపోవడం, నిరక్షరాస్యత, పేదరికమే ప్రధానంగా వాటిని భారత్ వైపు నడిపిస్తున్నాయి. గ్రామీణుల్ని, గ్రామీణ ప్రాంతాలనూ ప్రయో గాలకు ఎంచుకోవడంలోని ఆంతర్యం ఇదే. ఔషధ ప్రయోగాలకు సంసిద్ధులయ్యే వారికి వాటి వినియోగంవల్ల కలిగే ప్రభావాన్ని సరిగా వివరించకపోవడం, అనా రోగ్యం తలెత్తినప్పుడు పట్టించుకోకపోవడంవంటివి ఎన్నో సమస్యలు తెస్తున్నా యి. పాశ్చాత్య దేశాల్లో ఈ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తారు. అంతే కాదు...అక్కడ ప్రయోగాలకు సిద్ధపడేవారికిచ్చే మొత్తం చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు తీసుకురాబోయే సవరణ బిల్లులో పకడ్బందీ నిబంధనలున్నాయం టున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రయోగాలు జరపడంవల్ల రోగికి ఆరోగ్యపరంగా తీవ్ర సమస్య ఎదురైందని తేలితే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. ప్రయోగాల నిర్వహణ తీరు సరిగా లేదని తేలినా, అది లోపభూయిష్టంగా ఉన్నదని రుజువైనా రూ. 3 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. అయితే, ఈ తరహా ప్రయోగాలకు అనుమతించాల్సిన యంత్రాంగమేదో, ఆ ప్రయోగాలను పర్యవేక్షించాల్సిన వారెవరో నిర్దిష్టంగా పేర్కొని...వారి విధి నిర్వహణ సక్రమంగా లేనప్పుడు అమలులోకొచ్చే చర్యలేమిటన్న విషయంలో కూడా స్పష్టత ఉండాలి. బాధితులకివ్వాల్సిన పరిహారం గురించి కూడా నిర్దిష్టంగా ఉండాలి. అలాగే ప్రయోగాలు ఎక్కడో మారుమూల పల్లెలు, చిన్న పట్టణాల్లో కాక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే నగరాల్లోనే జరపాలన్న నిబంధన చేర్చాలి. అందువల్ల బాధితులకు సకాలంలో వైద్యసాయం అందడం తేలికవుతుంది. వీటితోపాటు రోగుల సంతకాలు తీసుకునే పత్రాలు ఇంగ్లిష్‌లో కాక స్థానిక భాషల్లో ఉండేలా చూడాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కొత్త చట్టంవల్ల సత్ఫలితాలు కలుగుతాయి. విచక్షణారహితమైన ప్రయోగాలకు బ్రేకుపడుతుంది.