
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్‌లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు.
ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment