సాక్షి,న్యూఢిల్లీ: మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను కేంద్ర మంత్రివర్గం బుధవారం అమోదించింది. అద్దె ఇళ్ల కొరతను పరిష్కరించేందుకు కొత్త వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె ఇళ్ల వ్యాపార రంగానికి నాంది పలికింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని పంపనుంది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం తోపాటు, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది.
దేశవ్యాప్తంగా అద్దెగృహాలకు సంబంధించి చట్టపరమైన చట్రాన్నిసరిదిద్దడంలో సహాయపడుతుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాలకు తగిన అద్దె హౌసింగ్ స్టాక్‌ను రూపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని, తద్వారా నిరాశ్రయుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.అద్దె గృహాలను క్రమంగా అధికారిక మార్కెట్ వైపుకు మార్చడం ద్వారా, మగృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 లో కేంద్రం "మోడల్ అద్దె చట్టం" ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అధికారిక అద్దె ఒప్పందం అవసరం, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, అద్దె పెరుగుదల రేటు, తొలగింపుకు కారణాలు వంటి అంశాలను ఇది పరిష్కరిస్తుంది. అలాగే అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా, అద్దెదారు ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ చట్టం ప్రకారం గరిష్టంగా రెండు నెలలు. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు.
చదవండి: Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ
Sun Halo: అందమైన రెయిన్‌బో.. ట్విటర్ ట్రెండింగ్
Comments
Please login to add a commentAdd a comment