మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది.
రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు.
రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు.
సిరియాలో ఆరు దశాబ్దాల అసద్‌ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment