![boyfriend bought banana without peel - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/10/banana.jpg.webp?itok=qUZXEJt-)
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది.
చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు.
తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన.
ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు.
ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!
Comments
Please login to add a commentAdd a comment