తలనొప్పికి 'యాప్' రాత
తల నొప్పితో బాధపడేవారికి శుభవార్త. తలనొప్పి ట్రీట్ మెంట్ కోసం కొత్త మార్గాన్ని అన్వేషించిన సైంటిస్తులు కొత్త యాప్ ను డెవలప్ చేశారు. తలనొప్పి కారణంగా ఎంత మొత్తంలో బాధను రికార్డు చేయడానికి యాప్ దోహదపడుతుందని సైంటిస్టులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ హెల్త్ ఇనిస్టిట్యూట్ బిహేవియరల్ బేసిస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్ అనే సంస్థకు సంబంధించిన ప్రొఫెసర్ పాల్ మార్టిన్ అధ్యయనంలో భాగంగా యాప్ వాడినట్టు తెలిసింది.
తలనొప్పితో బాధపడేవారు ఉపశమనం పొందేందుకు లర్నింగ్ టు కోప్ విత్ ట్రిగ్గర్స్ (ఎల్ సీటీ) అనే విధానాన్ని మార్టిన్ డిజైన్ చేశారు. ఎల్ సీటీ తోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానాన్ని ఉపయోగించినట్టు వెల్లడించారు. అలసట, శబ్ద కాలుష్యం, కలుషిత ఆహార పదార్థాల కారణంగా వచ్చే తలనొప్పి తీవ్రతను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ హెడెక్ డైరీలో డేటాను నిక్షిప్తం చేస్తుందని శాస్త్రజ్క్షులు తెలిపారు. రోజువారి తలనొప్పి తీవ్రత రేటింగ్ ఆధారంగా బాధను అరికట్టేందుకు చికిత్సను డిజైన్ చేసే అవకాశం ఉంటుందన్నారు.