కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్‌గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.
కంప్యూటర్‌పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్ అవాలి
కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్) డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్ తీసుకుంటుండటం మంచిది
తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటం సరికాదు
కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి
ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు
రణగొణ శబ్దాలకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు
రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
(చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!)
Comments
Please login to add a commentAdd a comment