Adam Zampa Missing His Wife Hattie Leigh 68 Days After Marriage - Sakshi
Sakshi News home page

Adam Zampa:'68 రోజులు క్రితం పెళ్లి.. 8 రోజులు మాత్రమే నా భార్యతో ఉన్నా'

Published Wed, Aug 25 2021 1:46 PM | Last Updated on Wed, Aug 25 2021 6:19 PM

Adam Zampa Express Pain Being Away From Wife 68 Days After Marriage - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన భార్యను 68 రోజులుగా మిస్‌ అవుతున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. ఆడమ్‌ జంపాకు గత జూన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ హాటీ లీ పామర్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికాక ముందు జంపా, హాటీ లీలలు జాలీగా ఎంజాయ్‌ చేస్తూ గడిపిన ఫోటోలు వారి ఇన్‌స్టాగ్రామ్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

అయితే పెళ్లయినప్పటి నుంచి మాత్రం జంపా తన భార్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆసీస్‌ జట్టులో ప్రస్తుతం కీలక స్పిన్నర్‌గా ఉన్న ఆడమ్‌ జంపా వరుస క్రికెట్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ టూర్లలో బిజీగా గడిపిన జంపా తన భార్యను మిస్సవుతున్నట్లు తాజాగా ఇన్‌స్టాలో వెల్లడించాడు.'' 68 రోజుల క్రితం నాకు పెళ్లైంది.. కానీ నా భార్యతో గడిపిన క్షణాలు 8 రోజులు మాత్రమే... తనను చాలా మిస్సవుతున్నా.. అంటూ'' ఏడుస్తున్న ఎమోజీతో ఫోటోను షేర్‌ చేశాడు. జంపా షేర్‌ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్‌ ఆఫ్రిది; పాకిస్తాన్‌ ఘన విజయం


ఇక ఆస్ట్రేలియా జట్టుకు వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పర్యటనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముందుగా వెస్టిండీస్‌ టూర్‌ చూసుకుంటే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో విండీస్‌కు అప్పగించింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన ఆసీస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా సెప్టెంబర్‌ 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు ఆడమ్‌ జంపా దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఐపీఎల్‌లో  ఆడమ్‌ జంపా ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆసీస్‌ తరపున జంపా 64 వన్డేల్లో 97 వికెట్లు, 50 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు.  

చదవండి: Rashid Khan: రషీద్‌ ఖాన్‌ హెలికాప్టర్‌ సిక్స్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement