ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 231/5గా ఉంది. బెన్ డకెట్ (88 బంతుల్లో 101), జాకబ్ బెథెల్ (15 బంతుల్లో 6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ మెరుపు ఆరంభాన్ని అందించారు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అనంతరం సాల్ట్ ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో ఔట్ కాగా.. విల్ జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. జాక్స్ వచ్చీ రాగనే హార్డీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డకెట్‌కు కెప్టెన్ బ్రూక్ జత కలిశాడు. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
Harry Brook toying with Azam Zampa. pic.twitter.com/LFuqt2BTLL
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024
జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్
బ్రూక్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేయగా.. అందులో మెజార్టీ శాతం పరుగులు జంపా బౌలింగ్‌లోనే సాధించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలు సాధించగా.. కేవలం జంపా బౌలింగ్‌లోనే ఓ బౌండరీ, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు, ఓ బౌండరీ కేవలం 13 బంతుల వ్యవధిలో సాధించాడు.
Harry Brook brings up his fifty with a six!!pic.twitter.com/rHltKptBTz
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024
జంపా బౌలింగ్‌లో బ్రూక్ విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది. మరో ఎండ్‌లో డకెట్ తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను టెయిలెండర్ బెథెల్ సహకారంతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. బ్రూక్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జేమీ స్మిత్ (6), లివింగ్‌స్టోన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హార్డీ, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
బ్రూక్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..
బ్రూక్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు
బ్రూక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కును తాకాడు
ఈ సిరీస్‌లో బ్రూక్‌కు ఇదివరకు మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (110, 87, 72)
ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు (312) చేసిన కెప్టెన్‌గా రికార్డు
గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (310) పేరిట ఉండేది
డకెట్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..
డకెట్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ
డకెట్ తన తొలి సెంచరీని (ఐర్లాండ్) సైతం ఇదే గ్రౌండ్‌లో (బ్రిస్టల్) చేశాడు
ఈ సిరీస్‌లో డకెట్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (95, 63, 101)
చదవండి: రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
Comments
Please login to add a commentAdd a comment