బ్యాట్స్‌మెన్‌కు రన్నింగ్ మెళుకువలు నేర్పుతున్న బోల్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఈ గురువారం నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్‌కు ఇరు జట్లు సంసిద్దమయ్యాయి. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేందుకు జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ కంగారుల జట్టుకు శిక్షణనిస్తున్నాడు. పరుగు పందెంలో రారాజైన ఈ జమైకన్ 100, 200 మీటర్ల విభాగాల్లో 8 ఒలింపిక్స్ పతకాలు అందుకొని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
గత లండన్ వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన బోల్ట్ రన్నింగ్ కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. ‘పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్నదానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్ ది హెరాల్డ్ దినపత్రికకు తెలిపాడు.
బోల్ట్ రన్నింగ్ టిప్స్ యాషేస్ సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆసీస్ క్రికెటర్ హ్యాండ్‌స్కోంబ్ తెలిపాడు. వికెట్ల మధ్య వేగంగా ఎలా పరుగెత్తాలో, అదే వేగంతోఎలా వెనక్కి రావాలో శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment