బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో కోట్లు కొల్లగొట్టేందుకు దేశీయ, విదేశీ స్టార్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఓ వార్త అభిమానులను కలవరపెడుతుంది. డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, స్టొయినిస్ లాంటి ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ తొలి దశలో జరిగే కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారని సమాచారం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఐపీఎల్ షెడ్యూల్‌పై పూర్తి క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఐపీఎల్ భారత్ వేదికగానే నిర్వహిస్తామని బీసీసీఐ బాస్ గంగూలీ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కోవిడ్ కారణంగా మ్యాచ్ వేదికల్లో, అలాగే మ్యాచ్ ప్రారంభ తేదీలో మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ లీగ్‌ను మార్చి 27 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తే.. కొన్ని ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్లు దూరం కావడం ఖాయం. ఎందుకంటే, ఏప్రిల్ 5 వరకు ఆస్ట్రేలియా పాకిస్ధాన్ పర్యటనలో ఉంటుంది. పాక్ పర్యటనలో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనున్న ఆసీస్.. ఈ సిరీస్ అనంతరం క్వారంటైన్ తదితర నిబంధనలు క్లియర్ చేసి భారత్‌కు చేరేందుకు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. దీంతో లీగ్‌లో పాల్గొనే ఆసీస్ ఆటగాళ్లు కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు తప్పక దూరం కావాల్సి వస్తుంది.
చదవండి: రాజకీయాల్లోకి ‘ది గ్రేట్ ఖలీ'.. ఏ పార్టీలో చేరాడో చూడండి..?
Comments
Please login to add a commentAdd a comment