ఇక లాభం లేదు రంగంలోకి దిగాల్సిందే.. | Lavanya Wants To Do Glamorous Roles | Sakshi
Sakshi News home page

ఇక లాభం లేదు

Published Wed, Mar 7 2018 9:02 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Lavanya Wants To Do Glamorous Roles - Sakshi

తమిళసినిమా: ఇక లాభం లేదు. రంగంలోకి దిగాలంతే అంటోంది నటి లావణ్యా త్రిపాఠి. అందాల రాక్షసిగా టాలీవుడ్‌లో, బ్రహ్మన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఉత్తరప్రదేశ్‌ బ్యూటీ లావణ్య. కోలీవుడ్‌లో బ్రహ్మన్‌ చిత్రం తన గీతను మార్చలేకపోయినా టాలీవుడ్‌లో అందాలరాక్షసి మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత కూడా మంచి అవకాశాలనే అందుకుంది. భలెభలె మగాడివోయ్‌ చిత్రం వరకూ మంచి రైజ్‌లో ఉన్న లావణ్యకు ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. విజయాలు ముఖం చాటేశాయి. వరుసగా అపజయాలు వెక్కిరించాయి. ఇంకేముంది అవకాశాలు దూరమయ్యాయి. తెలుగు తమిళం భాషల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న లావణ్యత్రిపాఠి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ అంటూ మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు అని నిర్ణయించుకుందట.

తనను తాను మోడరేట్‌ చేసుకుంది. అనుకున్నదే తడవుగా గ్లామర్‌గా తయారై ఫొటో సెషన్‌ చేసుకుని సోషల్‌ మీడియాకు విడుదల చేసింది. అయితే ఆ ఫొటోలు బాగున్నాయంటూ కామెంట్స్‌ చేశారే గానీ అవకాశాలు మాత్రం శూన్యం. ఇంకా మౌనంగా ఉంటే తెరమరుగైపోవడం ఖాయం అని భావించిన ఈ అమ్మడు పక్కింటి ఇమేజ్‌ను అటకెక్కించానని చెప్పేసింది. దీని గురించి లావణ్య పేర్కొంటూ అందరూ తనను పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కే పరిమితం చేస్తున్నారని, ఇకపై ఆ ఇమేజ్‌ను కొనసాగించదలచుకోలేదని చెప్పేసింది. కొత్త కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. గ్లామరస్‌ పాత్రల్లోనూ నటించడానికి రెడీ అని, తనకు సంతృప్తిని కలిగించే ఎలాంటి పాత్రలైనా నటించడానికి సిద్ధం అని తెలిపింది. ఇకపై అందాల లావణ్యను చూస్తారని అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement