
Police Lathicharge on Allu Arjun Fans at N Convention Hyderabad: మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం రద్దైందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు.
ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఫ్యాన్ మీట్ అంటూ నిర్వాహకులు పాసులు సైతం జారీ చేశారు. దీంతో పెద్దె ఎత్తున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న అభిమానులు ఫోటోసెషన్ క్యాన్సిల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసులు ఉన్నా అనూహ్యంగా ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ ఆందోళన చేస్తున్నారు.