భారత్లో సిస్కో ప్లాంట్! | Cisco readies plan to set up manufacturing plant in India | Sakshi
Sakshi News home page

భారత్లో సిస్కో ప్లాంట్!

Published Thu, Jul 14 2016 1:36 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

భారత్లో సిస్కో ప్లాంట్! - Sakshi

భారత్లో సిస్కో ప్లాంట్!

సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ వెల్లడి
లాస్‌వేగాస్: టెక్నాలజీ దిగ్గజం సిస్కో భారత్‌లో ఒక తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచి స్తోంది. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. భారత్ తమకు కీలకమైన కేంద్రాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. డిజిటైజేషన్ నుంచి స్మార్ట్ సిటీస్ వరకూ వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ జరిగిన సిస్కో లైవ్ 2016 వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. తయారీ రంగం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఒక వ్యాపార ప్రణాళికను  ఆయనకు సమర్పించామని చెప్పారు. భారత్‌లోని 15 స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుల్లో సిస్కో పనిచేస్తోందని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామన్నారు. భారత్ తమకు రెండో అతి పెద్ద మార్కెట్ అని, ఇక్కడ 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement