టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ నుంచి సుమారు 4వేల మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. అన్నీ కంపెనీల తరహాలో సిస్కో సైతం ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుంది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఫైర్ చేస్తున్నాం’ అని వెల్లడించింది.
రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా కొన్ని వ్యాపారాల దిద్దుబాటు క్రమంలో సిస్కో 4000 మంది ఉద్యోగులను సాగనంపే ప్రక్రియను ప్రారంభించిందనే వార్తలు టెకీల్లో కలకలం రేపింది. మరోవైపు తొలగించిన ఉద్యోగులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇక, సిస్కో తొలగించనున్న ఉద్యోగులు తమకు వేరే కంపెనీల్లో జాబ్‌ల కోసం రిఫర్ చేయాలని వారు ఆయా వేదికలపై అభ్యర్ధించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా సిస్కో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment