న్యూఢిల్లీ: భారత్‌లో క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం పనిచేసే ఇండియా వెబెక్స్ విభాగం మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. డేటా ప్రైవసీ, భద్రతకు సహాయపడే సిస్కో సెక్యూర్ ఉత్పత్తులు, సొల్యూషన్స్ దన్నుతో డేటా సెంటర్ కూడా వీటిలో ఉంటుందని పేర్కొంది.
వీడియో సమావేశాలు, కాలింగ్, మెసేజింగ్ మొదలైన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌ను వెబెక్స్ అందిస్తుంది. దేశవ్యాప్తంగా వెబెక్స్ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అవసరమైన లైసెన్సులను కూడా పొందినట్లు సిస్కో తెలిపింది. భారత్‌లో వెబెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల సిస్కోకు వ్యయాలు తగ్గడంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునేందుకు, దేశీ పరిస్థితులకు అనుగుణమైన ధరలకే కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment