చెన్నై: డిజిటల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో ఉన్న యూఎస్ దిగ్గజం సిస్కో తాజాగా భారత్‌లో తొలి ప్లాంటును ప్రారంభించింది. చెన్నైలోని ఈ కేంద్రంలో రూటింగ్, స్విచింగ్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ ఫెసిలిటీ ద్వారా తమిళనాడులో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని కంపెనీ ప్రకటించింది.
ఎగుమతులతో కలుపుకుని ఏటా 1.3 బిలియన్ డాలర్ల ఆదాయ నమోదుకు అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నైలో తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి, విస్తరణకు ఫ్లెక్స్‌తో సిస్కో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ప్రారంభంలో సిస్కో నెట్‌వర్క్ కన్వర్జెన్స్ సిస్టమ్–540 సిరీస్ రూటర్ల తయారీపై దృష్టి పెడుతుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్లాంటు ప్రారంభం అయింది.
Comments
Please login to add a commentAdd a comment