అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి గుజరాత్ పరిశ్రమల శాఖ మంత్రి భారీ షాకిచ్చారు. గుజరాత్‌లో ఇతర ఆటోమొబైల్ సంస్థలకు కల్పించిన సౌకర్యాలనే టెస్లాకు ఇస్తామని అన్నారు. అంతే తప్పా టెస్లాకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వబోమని స్పస్టం చేశారు.
గుజరాత్‌లో జనవరి 10-12 వరకు ‘వైబ్రంట్ గుజరాత్ 2014’ సమ్మిట్ జరగనుంది. ఈ తరుణంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఎలన్ మస్క్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై మంత్రి బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ పై విధంగా స్పందించారు.
ఈ సదస్సులో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే భారత్ తమకు ప్రత్యేక మినహాంపులిస్తే కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని గతంలో ఎలాన్ మస్క్ అన్నారు. తాజా, బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని మరింత ఆసక్తికరంగా మారింది.
కాగా, గుజరాత్‌లో ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. తాజా టెస్లా రాకతో గుజారాత్‌తో పాటు ఆటోమొబైల్ రంగ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మీడియా కథనాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని సనంద్, ధోలెరా, బెచరాజీ ప్రాంతాల్లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. దేశీయంగా కార్ల విక్రయానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా గుజరాత్ రాష్ట్రంలోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు 15-20 శాతం తగ్గిస్తారని గత నెలలో కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment