'6,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం'
శాన్‌ఫ్రాన్సిస్కో: గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 5,500 మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని మరో 1100 మంది ఉద్యోగులను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2016 ఆగష్టులో తీసుకున్న రీ స్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా కీ ప్రయారిటీ ఏరియాల్లో పెట్టుబడుల కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వివరించింది. 2018 తొలి క్వార్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఓ వైపు ఉద్యోగులకు పింక స్లిప్‌లు ఇస్తుండగా తాజాగా ఆ జాబితాలోకి సిస్కో కూడా వచ్చి చేరింది.