తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు సిస్కో ఆసక్తి చూపిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు.
సిస్కో చైర్మన్‌తో కేటీఆర్ చర్చలు
Published Fri, May 26 2017 4:32 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్: తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు సిస్కో ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. శుక్రవారం సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. సంస్ధ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో ప్రణాళికలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టీ హబ్ వంటి కార్యక్రమాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తెలంగాణ రాష్ర్టం పైన సిస్కో చైర్మన్ ప్రసంశలు కురిపించారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటం ద్వారా డిజిటల్ తెలంగాణ సాధ్యమని తెలిపారు. డిజిటైలైజేషన్ తో ప్రజల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయని, అర్ధిక వ్యవస్ధ బలోపేతం అవుతుందని వివరించారు. ఈ మేరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్ స్ర్టేషన్ నెట్ వర్క్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని సిస్కో ఇండియా టీంను జాన్ చాంబర్స్ ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన టీ హబ్ లోని స్టార్టప్స్, హైదరాబాద్ పారిశ్రామిక వేత్తలతో మాట్లాడేందుకు సంసిద్ధత తెలిపారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.ద మంత్రి వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.
Advertisement
Advertisement