అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. | Cisco Systems 4000 Layoffs | Sakshi
Sakshi News home page

అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి!

Published Thu, Feb 15 2024 4:01 PM | Last Updated on Thu, Feb 15 2024 5:29 PM

Cisco Systems 4000 Layoffs - Sakshi

సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు చెప్పినట్లుగానే.. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది.

2023లో కంపెనీలోని మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 85000. ఇందులో ఈ ఏడాది ఏకంగా 4000 మందిని ఇంటికి పంపేసింది. ఉద్యోగుల తొలగింపులపైన కూడా కంపెనీ 800 మిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఉద్యోగుల తొలగింపు చెల్లింపులు, ఇతర సంబంధిత ఖర్చులకు నిధులుగా సమకూర్చుతుంది.

ఇదీ చదవండి: టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్‌ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..

సిస్కో కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగానే అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండవ త్రైమాసికంలో ఆదాయం 52.5 బిలియన్ డాలర్ల నుంచి 51.5 బిలియన్ల డాలర్లకు తగ్గింది. దీంతో కంపెనీ షేర్స్ కూడా 5 శాతానికిపైగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగానే.. తాజాగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement