శాన్‌ఫ్రాన్సిస్కో: ఓపెన్ సోర్స్ సొల్యూషన్స్ లీడర్ రెడ్ హ్యాట్ కంపెనీని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్ కొనుగోలు చేసింది. రెడ్ హ్యాట్ కొనుగోలుతో లక్ష కోట్ల డాలర్ల హైబ్రిడ్ క్లౌడ్ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఐబీఎమ్ మరో అడుగు ముందుకేసింది. ఈ డీల్ విలువ 3,400 కోట్ల డాలర్లు. ఐబీఎమ్ ఇప్పటి వరకూ ఎన్నో కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల లావాదేవీల్లో ఇదే అది పెద్దది.
రెడ్ హ్యాట్‌ను కొనుగోలు చేయడం క్లౌడ్ మార్కెట్లో పెను మార్పుకు దారి తీయనున్నదని ఐబీఎమ్ చైర్మన్, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గిన్ని రొమెట్టీ వ్యాఖ్యానించారు. హైబ్రిడ్ క్లౌడ్ సేవలందించే అతి పెద్ద ప్రపంచ సంస్థగా ఐబీఎమ్ అవతరించనున్నదని ఆమె పేర్కొన్నారు.
ఈ డీల్‌లో భాగంగా ఒక్కొక్క రెడ్‌హ్యాట్ షేర్‌ను 190 డాలర్లకు ఐబీఎమ్ కొనుగోలు చేయనున్నది. క్లౌడ్ మార్కెట్లో ఐబీఎమ్ కంపెనీ. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాప్ట్, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. రెడ్ హ్యాట్‌ను కొనుగోలు చేయడం వల్ల క్లౌడ్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారŠమ్స్ మార్కెట్లో ఐబీఎమ్ పటిష్ట కంపెనీగా అవతరించగలదని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment