టాటా స్టీల్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
యూరప్ వ్యాపారాన్ని జాయింట్ వెంచర్‌గా మార్పుచేసిన నేపథ్యంలో టాటా స్టీల్ 1.6 శాతం ర్యాలీ జరిపి రూ. 687.60 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 14.68 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 2.42 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ.2.50 నుంచి రూ.1కి తగ్గింది. స్పాట్ కొనుగోళ్లకు రక్షణగా జరిగిన షార్టింగ్ కార్యకలాపాల్ని ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 680 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.04 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 13.68 లక్షల షేర్ల కాల్ బిల్డప్, 11.88 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది.
రూ. 690, రూ. 700 స్ట్రయిక్స్ వద్ద తాజా కాల్ రైటింగ్ కారణంగా 1.96 లక్షలు, 1.34 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద మొత్తం కాల్ బిల్డప్ వరుసగా 12.82 లక్షలు, 26.46 లక్షలకు చేరింది. రూ.670 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 11.30 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 680పైన స్థిరపడితే క్రమేపీ రూ. 700 స్థాయిని చేరవచ్చని, రూ. 680 స్థాయిని కోల్పోతే రూ. 670 వరకూ క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.