Futures signals
-
టాటా స్టీల్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
యూరప్ వ్యాపారాన్ని జాయింట్ వెంచర్‌గా మార్పుచేసిన నేపథ్యంలో టాటా స్టీల్ 1.6 శాతం ర్యాలీ జరిపి రూ. 687.60 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 14.68 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 2.42 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ.2.50 నుంచి రూ.1కి తగ్గింది. స్పాట్ కొనుగోళ్లకు రక్షణగా జరిగిన షార్టింగ్ కార్యకలాపాల్ని ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 680 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.04 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 13.68 లక్షల షేర్ల కాల్ బిల్డప్, 11.88 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. రూ. 690, రూ. 700 స్ట్రయిక్స్ వద్ద తాజా కాల్ రైటింగ్ కారణంగా 1.96 లక్షలు, 1.34 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద మొత్తం కాల్ బిల్డప్ వరుసగా 12.82 లక్షలు, 26.46 లక్షలకు చేరింది. రూ.670 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 11.30 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 680పైన స్థిరపడితే క్రమేపీ రూ. 700 స్థాయిని చేరవచ్చని, రూ. 680 స్థాయిని కోల్పోతే రూ. 670 వరకూ క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
ఐడియా సెల్యులర్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారం అధిక ట్రేడింగ్ పరిమాణంతో పెరిగిన షేర్లలో ఐడియా సెల్యులర్ ఒకటి. ఈ షేరు 4.9 శాతం ఎగిసి రూ. 82.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 3.16 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో ఇంతటి భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడం గత 7 వారాల్లో ఇదే ప్రధమం. ఈ సందర్భంగా ఐడియా ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 23.73 లక్షల షేర్లు (3.69 శాతం) కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.19 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 40 పైసల మేర స్థిరంగా వుంది. ఫ్యూచర్లో జరిగిన షార్ట్ కవరింగ్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 80 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. కాల్ ఆప్షన్ నుంచి 12.8 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 13.65 లక్షలకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.30 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 19.95 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 85 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా 5.74 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 34.72 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు క్షీణిస్తే రూ. 80 సమీపంలో మద్దతు పొందవచ్చని, క్రమేపీ రూ. 85 స్థాయిని చేరవచ్చని ఆప్షన్ రైటర్ల యాక్టివిటీ వెల్లడిస్తున్నది. -
యాక్సిస్ బ్యాంక్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
బ్యాంక్ నిఫ్టీలో భాగమైన బ్యాంకింగ్ షేర్లలో కొన్ని ఒకటి, రెండు వారాల గరిష్టస్థాయిలో ముగియగా, మరికొన్ని రెండు, మూడు వారాల కనిష్టస్థాయిలో క్లోజయ్యాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్ షేరు 2.1 శాతం మేర క్షీణించి మూడు వారాల కనిష్టస్థాయి రూ. 492.75 వద్ద ముగిసింది. ఈ షేరు ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 18.74 లక్షల షేర్లు (6.18 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 3.21 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ప్రీమియం మాత్రం రూ. 1.30 నుంచి రూ. 2.50కి పెరిగింది. స్పాట్ అమ్మకాలకు రివర్స్‌లో ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. షేరు క్షీణించినప్పటికీ, ఆప్షన్స్ విభాగంలో రూ. 500 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో మరో 20 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 13.65 లక్షల పుట్ బిల్డప్ వుంది. ఇదే స్ట్రయిక్ వద్ద తాజా కాల్ రైటింగ్ ఫలితంగా 6.30 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం కాల్ బిల్డప్ 9.75 లక్షలకు చేరింది. రూ. 510 స్ట్రయిక్ వద్ద సైతం భారీ కాల్‌రైటింగ్ ఫలితంగా 2.73 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం బిల్డప్ 13.29 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 490, రూ. 480 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ రైటింగ్ జరిగింది. ఈ స్ట్రయిక్స్ వద్ద 4.46 లక్షలు, 5.49 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ వుంది. ఈ కౌంటర్లో బుల్స్, బేర్స్ హోరాహోరీగా వున్నారని, దీంతో యాక్సిస్ బ్యాంక్ సమీప భవిష్యత్తులో రూ. 480–510 శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఫ్యూచర్స్, ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. -
భారతి ఎయిర్టెల్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారంనాటి మార్కెట్ ర్యాలీలో బ్యాంకింగ్ షేర్లతో పాటు మెటల్, టెలికం రంగాలకు చెందిన షేర్లు కూడా పాలుపంచుకున్నాయి. వీటిలో టెలికం షేరు భారతి ఎయిర్టెల్ 2.6 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 432 వద్ద ముగిసింది. జూలై నెలలో ఈ షేరు మూడు దఫాలు రూ. 430 స్థాయిని తాకినప్పటికీ, ఆపైన ముగియలేకపోయింది. తాజా ర్యాలీ సందర్భంగా భారతి ఎయిర్టెల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 1.46 లక్షల షేర్లు (0.50 శాతం) కట్ అయ్యాయి. దీంతో మొత్తం ఓఐ 2.90 కోట్లకు తగ్గింది. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ధర ప్రీమియం సైతం రూ. 1.70 నుంచి రూ. 1కి తగ్గింది. స్వల్పంగా ఓఐ కట్‌కావడం బుల్ ఆన్వైండింగ్ను సూచిస్తుండగా, ప్రీమియం తగ్గుదలకు డెరివేటివ్ సెటిల్మెంట దగ్గరపడుతుండటం కారణం. ఆప్షన్స్ విభాగంలో రూ. 430 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్‌తో లక్ష షేర్లు కట్‌కాగా, బిల్డప్ 5.30 లక్షలకు తగ్గింది. రూ. 440 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్‌రైటింగ్ జరగడంతో 11 వేల షేర్లు యాడ్ అయ్యాయి. బిల్డప్ 5.15 లక్షల షేర్లకు చేరింది. రూ. 420 స్ట్రయిక్ వద్ద భారీ పుట్ రైటింగ్ జరగడంతో 3.72 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. పుట్ బిల్డప్ 7.90 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్య వార్తలేవైనా వెలువడితే తప్ప, ఈ షేరు తగ్గితే రూ. 420 సమీపంలో మద్దతు పొందవచ్చని, రూ. 430పైన స్థిరపడితే క్రమేపీ రూ. 440 స్థాయిని అధిగమించవచ్చని ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది. -
ఎస్బీఐ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (ఎఫ్అండ్ ఓ) ఏ షేర్లయితే బెటర్? ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఎస్బీఐ: దాదాపు ప్రైవేటు బ్యాంకులన్నీ ఆర్థిక ఫలితాలు ఇప్పటికే వెల్లడించగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫలితాల వెల్లడికి ఇంకా తేదీని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ షేరు గురువారం రూ. 300 సమీపస్థాయికి పెరిగిన తర్వాత రూ. 298 వద్ద ముగిసింది. జూలై నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభంతో పోలిస్తే శుక్రవారం మొదలుకానున్న ఆగస్టు సిరీస్‌కు పలు ప్రధాన షేర్లకు సంబంధించిన రోలోవర్స్ చాలా తక్కువగా వున్నాయి. ఈ రీతిలోనే ఎస్బీఐ ఆగస్టు ఫ్యూచర్‌కు గురువారం 1.45 కోట్ల షేర్ల రోలోవర్ జరిగింది. దాంతో ఆ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 5.49 కోట్లకు చేరింది. జూలై సిరీస్‌తో పోలిస్తే ఈ ఓఐ 25 శాతం తక్కువ. స్పాట్ ధరతో పోలిస్తే ఆగస్టు ఫ్యూచర్ ప్రీమియం (రూ.170) క్రితం రోజుకంటే స్వల్పంగా తగ్గింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద సిరీస్ ప్రారంభానికి ముందే కాల్ బిల్డప్ 27.15 లక్షలకు చేరింది (తాజా యాడ్ అయినవి 2.82 లక్షలు). రూ. 310 స్ట్రయిక్ వద్ద 8.73 లక్షల షేర్లు యాడ్‌కాగా, ఇక్కడ కాల్ బిల్డప్ 17.55 లక్షలకు పెరిగింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద తాజా పుట్‌రైటింగ్ కారణంగా 2.31 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 8.55 లక్షలకు చేరింది. రూ. 290 స్ట్రయిక్ వద్ద 3.42 లక్షల పుట్స్ యాడ్‌కాగా, బిల్డప్ 14.34 లక్షల షేర్లకు పెరిగింది. రోలోవర్స్ తగ్గడం, ప్రీమియం స్వల్పంగా క్షీణించడం, పుట్ రైటింగ్కంటే కాల్ రైటింగ్ బలంగా వుండటం...ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో నెగిటివ్ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. రూ. 300 దిగువనే స్థిరపడితే క్రమేపీ రూ. 290 స్థాయికి తగ్గవచ్చని, రూ. 300 స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 310 స్థాయిని అందుకోవొచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
నిఫ్టీ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... నిఫ్టీ: ఎన్ఎస్ఈ ప్రధాన సూచి నిఫ్టీ–50 మేజిక్ ఫిగర్ 10,000 పాయింట్లస్థాయిని బుధవారం క్షణంపాటు దాటినప్పటికీ, వెనువెంటనే పడిపోయి 2 పాయింట్ల నష్టంతో 9,964 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే 10,000 పాయింట్లస్థాయిని టచ్చేయలేకపోయిన జూలై నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో మంగళవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో షార్ట్ కవరింగ్‌తో పాటు, ఆగస్టు సిరీస్‌కు పటిష్టమైన రోలోవర్స్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. క్రితం రోజు 10 పాయింట్ల డిస్కౌంట్‌తో 9,956 పాయింట్ల వద్ద ముగిసిన జూలై నిఫ్టీ కాంట్రాక్టు మంగళవారం 10 పాయింట్ల ప్రీమియంతో 9,974 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 21.56 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ప్రీమియం పెరగడం, ఓఐ తగ్గడం షార్ట్ కవరింగ్‌ను సూచిస్తున్నది. ఇదే సమయంలో లాంగ్ రోలోవర్స్ను ప్రతిబింబిస్తూ ఆగస్టు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 23.20 లక్షల షేర్లు యాడ్‌కావడంతో పాటు ఆ కాంట్రాక్టు ప్రీమియం క్రితం రోజుతో పోలిస్తే 30 పాయింట్ల నుంచి 50 పాయింట్లకు పెరిగింది. ఈ కాంట్రాక్టు 9,994 పాయింట్ల నుంచి 10,014 పాయింట్ల స్థాయికి చేరింది. ఇక జూలై 10,000 స్ట్రయిక్ వద్ద తాజా కాల్‌రైటింగ్ జరగడంతో 8.86 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 73.87 లక్షల షేర్ల బిల్డప్ వుంది. 10,100 స్ట్రయిక్ వద్ద స్వల్ప కాల్కవరింగ్ ఫలితంగా 1.94 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ఇక్కడ కాల్ బిల్డప్ 33.78 లక్షల షేర్లకు తగ్గింది. 9,900 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా 3.88 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 63.69 లక్షల షేర్లకు పెరిగింది. జూలై నిఫ్టీ ఫ్యూచర్ డిస్కౌంట్ నుంచి ప్రీమియంలోకి మళ్లడం, ఆగస్టు ఫ్యూచర్ ప్రీమియం పెరగడం..సమీప భవిష్యత్తులో పాజిటివ్ ట్రెండ్‌ను సూచిస్తున్నది. నిఫ్టీ 10,000 పాయింట్ల స్థాయిపైన స్థిరపడితే 10,100 పాయింట్ల స్థాయిని దాటవచ్చని, 10,000 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోతే 9,900 పాయింట్ల స్థాయివరకూ తగ్గవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. హిందాల్కో ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ఇన్ఫోసిస్ డేటా ఏం చెబుతోంది? ఈ వివరాలు www.sakshibusiness.comలో -
బ్యాంక్ నిఫ్టీ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్యాంక్ నిఫ్టీ: బ్యాంక్ నిఫ్టీ సోమవారం ప్రధాన సూచి నిఫ్టీని మించి 0.6 శాతం పెరిగింది. అయితే స్పాట్ బ్యాంక్ నిఫ్టీ 163 పాయింట్ల పెరుగుదలతో 24,421 వద్ద ముగిసినప్పటికీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో మాత్రం 122 పాయింట్లు మాత్రమే ప్లస్ అయ్యాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 50 పాయింట్ల డిస్కౌంట్‌తో 24,371 వద్ద ముగిసింది. తాజాగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 1.06 లక్షల షేర్లు (4.24 శాతం) కట్ అయ్యాయి. సూచీ అప్‌ట్రెండ్ సాగించినా, ఓఐ, ప్రీమియంలు తగ్గడం బుల్ ఆఫ్‌లోడింగ్‌కు సంకేతం. జూలై నెలలో ఇప్పటివరకూ ఈ ఫ్యూచర్ 5.13 శాతం పెరిగినందున, లాభాల స్వీకరణ జరిగివుండవచ్చు. మరో మూడు రోజుల్లో జూలై డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ 24,500 స్ట్రయిక్ వద్ద తాజా కాల్‌రైటింగ్ ఫలితంగా 1,71 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ కాల్ బిల్డప్ భారీగా 12.50 లక్షల షేర్లకు చేరింది, ఇదే సమయంలో 24,400, 24,300 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ కూడా అధికంగానే జరిగింది. 24,400 స్టయిక్ వద్ద 3.51 లక్షలు, 24,300 స్ట్రయిక్ వద్ద 3.97 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. దీంతో ఈ రెండు స్ట్రయిక్స్ వద్ద పుట్ బిల్డప్ వరుసగా 3.77 లక్షలు, 5.05 లక్షలకు చొప్పున చేరింది. స్వల్పకాలంలో 24,500 పాయింట్ల స్థాయి బ్యాంక్ నిఫ్టీకి అవరోధం కల్గించవచ్చని, ఈ స్థాయిని దాటితేనే మరింత ర్యాలీ సాధ్యపడుతుందని, క్షీణత సంభవిస్తే 24,300 సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చని, ఈ మద్దతు కోల్పోతే మరింత తగ్గవచ్చని ఆయా స్ట్రయిక్స్ వద్ద జరిగిన ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. టీసీఎస్ ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ఐడీబీఐ బ్యాంక్ డేటా ఏం చెబుతోంది? ఈ వివరాలు www.sakshibusiness.com-లో