స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...
బ్యాంక్ నిఫ్టీ: బ్యాంక్ నిఫ్టీ సోమవారం ప్రధాన సూచి నిఫ్టీని మించి 0.6 శాతం పెరిగింది. అయితే స్పాట్ బ్యాంక్ నిఫ్టీ 163 పాయింట్ల పెరుగుదలతో 24,421 వద్ద ముగిసినప్పటికీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్‌లో మాత్రం 122 పాయింట్లు మాత్రమే ప్లస్ అయ్యాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 50 పాయింట్ల డిస్కౌంట్‌తో 24,371 వద్ద ముగిసింది. తాజాగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 1.06 లక్షల షేర్లు (4.24 శాతం) కట్ అయ్యాయి. సూచీ అప్‌ట్రెండ్ సాగించినా, ఓఐ, ప్రీమియంలు తగ్గడం బుల్ ఆఫ్‌లోడింగ్‌కు సంకేతం. జూలై నెలలో ఇప్పటివరకూ ఈ ఫ్యూచర్ 5.13 శాతం పెరిగినందున, లాభాల స్వీకరణ జరిగివుండవచ్చు.
మరో మూడు రోజుల్లో జూలై డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ 24,500 స్ట్రయిక్ వద్ద తాజా కాల్‌రైటింగ్ ఫలితంగా 1,71 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ కాల్ బిల్డప్ భారీగా 12.50 లక్షల షేర్లకు చేరింది, ఇదే సమయంలో 24,400, 24,300 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ కూడా అధికంగానే జరిగింది. 24,400 స్టయిక్ వద్ద 3.51 లక్షలు, 24,300 స్ట్రయిక్ వద్ద 3.97 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. దీంతో ఈ రెండు స్ట్రయిక్స్ వద్ద పుట్ బిల్డప్ వరుసగా 3.77 లక్షలు, 5.05 లక్షలకు చొప్పున చేరింది. స్వల్పకాలంలో 24,500 పాయింట్ల స్థాయి బ్యాంక్ నిఫ్టీకి అవరోధం కల్గించవచ్చని, ఈ స్థాయిని దాటితేనే మరింత ర్యాలీ సాధ్యపడుతుందని, క్షీణత సంభవిస్తే 24,300 సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చని, ఈ మద్దతు కోల్పోతే మరింత తగ్గవచ్చని ఆయా స్ట్రయిక్స్ వద్ద జరిగిన ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది.
టీసీఎస్ ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి?
ఐడీబీఐ బ్యాంక్ డేటా ఏం చెబుతోంది?
ఈ వివరాలు www.sakshibusiness.com-లో
బ్యాంక్ నిఫ్టీ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
Published Tue, Jul 25 2017 2:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
Advertisement
Advertisement