ఎస్‌బీఐ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (ఎఫ్‌అండ్ ఓ) ఏ షేర్లయితే బెటర్? ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...
ఎస్‌బీఐ: దాదాపు ప్రైవేటు బ్యాంకులన్నీ ఆర్థిక ఫలితాలు ఇప్పటికే వెల్లడించగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఫలితాల వెల్లడికి ఇంకా తేదీని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ షేరు గురువారం రూ. 300 సమీపస్థాయికి పెరిగిన తర్వాత రూ. 298 వద్ద ముగిసింది. జూలై నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభంతో పోలిస్తే శుక్రవారం మొదలుకానున్న ఆగస్టు సిరీస్‌కు పలు ప్రధాన షేర్లకు సంబంధించిన రోలోవర్స్ చాలా తక్కువగా వున్నాయి. ఈ రీతిలోనే ఎస్‌బీఐ ఆగస్టు ఫ్యూచర్‌కు గురువారం 1.45 కోట్ల షేర్ల రోలోవర్ జరిగింది. దాంతో ఆ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 5.49 కోట్లకు చేరింది.
జూలై సిరీస్‌తో పోలిస్తే ఈ ఓఐ 25 శాతం తక్కువ. స్పాట్ ధరతో పోలిస్తే ఆగస్టు ఫ్యూచర్ ప్రీమియం (రూ.170) క్రితం రోజుకంటే స్వల్పంగా తగ్గింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద సిరీస్ ప్రారంభానికి ముందే కాల్ బిల్డప్ 27.15 లక్షలకు చేరింది (తాజా యాడ్ అయినవి 2.82 లక్షలు). రూ. 310 స్ట్రయిక్ వద్ద 8.73 లక్షల షేర్లు యాడ్‌కాగా, ఇక్కడ కాల్ బిల్డప్ 17.55 లక్షలకు పెరిగింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద తాజా పుట్‌రైటింగ్ కారణంగా 2.31 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 8.55 లక్షలకు చేరింది. రూ. 290 స్ట్రయిక్ వద్ద 3.42 లక్షల పుట్స్ యాడ్‌కాగా, బిల్డప్ 14.34 లక్షల షేర్లకు పెరిగింది.
రోలోవర్స్ తగ్గడం, ప్రీమియం స్వల్పంగా క్షీణించడం, పుట్ రైటింగ్‌కంటే కాల్ రైటింగ్ బలంగా వుండటం...ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో నెగిటివ్ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. రూ. 300 దిగువనే స్థిరపడితే క్రమేపీ రూ. 290 స్థాయికి తగ్గవచ్చని, రూ. 300 స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 310 స్థాయిని అందుకోవొచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.