ఐడియా సెల్యులర్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారం అధిక ట్రేడింగ్ పరిమాణంతో పెరిగిన షేర్లలో ఐడియా సెల్యులర్ ఒకటి. ఈ షేరు 4.9 శాతం ఎగిసి రూ. 82.60 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 3.16 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో ఇంతటి భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడం గత 7 వారాల్లో ఇదే ప్రధమం. ఈ సందర్భంగా ఐడియా ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 23.73 లక్షల షేర్లు (3.69 శాతం) కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.19 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 40 పైసల మేర స్థిరంగా వుంది.
ఫ్యూచర్లో జరిగిన షార్ట్ కవరింగ్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 80 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. కాల్ ఆప్షన్ నుంచి 12.8 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 13.65 లక్షలకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.30 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 19.95 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 85 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా 5.74 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 34.72 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు క్షీణిస్తే రూ. 80 సమీపంలో మద్దతు పొందవచ్చని, క్రమేపీ రూ. 85 స్థాయిని చేరవచ్చని ఆప్షన్ రైటర్ల యాక్టివిటీ వెల్లడిస్తున్నది.