బ్యాంక్ నిఫ్టీలో భాగమైన బ్యాంకింగ్ షేర్లలో కొన్ని ఒకటి, రెండు వారాల గరిష్టస్థాయిలో ముగియగా, మరికొన్ని రెండు, మూడు వారాల కనిష్టస్థాయిలో క్లోజయ్యాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్ షేరు 2.1 శాతం మేర క్షీణించి మూడు వారాల కనిష్టస్థాయి రూ. 492.75 వద్ద ముగిసింది. ఈ షేరు ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 18.74 లక్షల షేర్లు (6.18 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 3.21 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ప్రీమియం మాత్రం రూ. 1.30 నుంచి రూ. 2.50కి పెరిగింది. స్పాట్ అమ్మకాలకు రివర్స్‌లో ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. షేరు క్షీణించినప్పటికీ, ఆప్షన్స్ విభాగంలో రూ. 500 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో మరో 20 వేల షేర్లు యాడ్ అయ్యాయి.
ఇక్కడ 13.65 లక్షల పుట్ బిల్డప్ వుంది. ఇదే స్ట్రయిక్ వద్ద తాజా కాల్ రైటింగ్ ఫలితంగా 6.30 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం కాల్ బిల్డప్ 9.75 లక్షలకు చేరింది. రూ. 510 స్ట్రయిక్ వద్ద సైతం భారీ కాల్‌రైటింగ్ ఫలితంగా 2.73 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం బిల్డప్ 13.29 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 490, రూ. 480 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ రైటింగ్ జరిగింది. ఈ స్ట్రయిక్స్ వద్ద 4.46 లక్షలు, 5.49 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ వుంది. ఈ కౌంటర్లో బుల్స్, బేర్స్ హోరాహోరీగా వున్నారని, దీంతో యాక్సిస్ బ్యాంక్ సమీప భవిష్యత్తులో రూ. 480–510 శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఫ్యూచర్స్, ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది.
యాక్సిస్ బ్యాంక్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
Published Thu, Sep 7 2017 1:20 AM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM
Advertisement
Advertisement