నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌! | nifty future signals | Sakshi
Sakshi News home page

నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

Published Wed, Jul 26 2017 1:02 AM | Last Updated on Wed, Oct 17 2018 5:19 PM

నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌! - Sakshi

నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్‌ ఇంట్రస్ట్‌ హెచ్చుతగ్గులు... కాల్, పుట్‌ రైటింగ్‌ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

నిఫ్టీ: ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ–50 మేజిక్‌ ఫిగర్‌ 10,000 పాయింట్లస్థాయిని బుధవారం క్షణంపాటు దాటినప్పటికీ, వెనువెంటనే పడిపోయి 2 పాయింట్ల నష్టంతో 9,964 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే 10,000 పాయింట్లస్థాయిని టచ్‌చేయలేకపోయిన జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ కాంట్రాక్టులో మంగళవారం ట్రేడింగ్‌ ముగింపు సమయంలో షార్ట్‌ కవరింగ్‌తో పాటు, ఆగస్టు సిరీస్‌కు పటిష్టమైన రోలోవర్స్‌ జరిగినట్లు డెరివేటివ్‌ డేటా వెల్లడిస్తున్నది. క్రితం రోజు 10 పాయింట్ల డిస్కౌంట్‌తో 9,956 పాయింట్ల వద్ద ముగిసిన జూలై నిఫ్టీ కాంట్రాక్టు మంగళవారం 10 పాయింట్ల ప్రీమియంతో 9,974 వద్ద క్లోజయ్యింది.

 మరోవైపు ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ) నుంచి 21.56 లక్షల షేర్లు కట్‌ అయ్యాయి. ప్రీమియం పెరగడం, ఓఐ తగ్గడం షార్ట్‌ కవరింగ్‌ను సూచిస్తున్నది. ఇదే సమయంలో లాంగ్‌ రోలోవర్స్‌ను ప్రతిబింబిస్తూ ఆగస్టు నిఫ్టీ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఓఐలో 23.20 లక్షల షేర్లు యాడ్‌కావడంతో పాటు ఆ కాంట్రాక్టు ప్రీమియం క్రితం రోజుతో పోలిస్తే 30 పాయింట్ల నుంచి 50 పాయింట్లకు పెరిగింది. ఈ కాంట్రాక్టు 9,994 పాయింట్ల నుంచి 10,014 పాయింట్ల స్థాయికి చేరింది. ఇక జూలై 10,000 స్ట్రయిక్‌ వద్ద తాజా కాల్‌రైటింగ్‌ జరగడంతో 8.86 లక్షల షేర్లు యాడ్‌ అయ్యాయి. ఇక్కడ 73.87 లక్షల షేర్ల బిల్డప్‌ వుంది.

 10,100 స్ట్రయిక్‌ వద్ద స్వల్ప కాల్‌కవరింగ్‌ ఫలితంగా 1.94 లక్షల షేర్లు కట్‌ అయ్యాయి. ఇక్కడ కాల్‌ బిల్డప్‌ 33.78 లక్షల షేర్లకు తగ్గింది. 9,900 స్ట్రయిక్‌ వద్ద పుట్‌ రైటింగ్‌ కారణంగా 3.88 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్‌ 63.69 లక్షల షేర్లకు పెరిగింది. జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ డిస్కౌంట్‌ నుంచి ప్రీమియంలోకి మళ్లడం, ఆగస్టు ఫ్యూచర్‌ ప్రీమియం పెరగడం..సమీప భవిష్యత్తులో పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నది. నిఫ్టీ 10,000 పాయింట్ల స్థాయిపైన స్థిరపడితే 10,100 పాయింట్ల స్థాయిని దాటవచ్చని, 10,000 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోతే 9,900 పాయింట్ల స్థాయివరకూ తగ్గవచ్చని ఆప్షన్‌ డేటా వెల్లడిస్తున్నది.

 హిందాల్కో ఫ్యూచర్‌ సంకేతాలెలా ఉన్నాయి?
 ఇన్ఫోసిస్‌ డేటా ఏం చెబుతోంది?
ఈ వివరాలు www.sakshibusiness.comలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement