టాటా స్టీల్ నష్టం రూ. 5,674 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు తయారీ దిగ్గజం టాటా స్టీల్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 5,674 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నగదుయేతర రైట్ డౌన్స్ తాజా నష్టాలకు కారణం. మరోవైపు తాజా క్యూ4లో ఆదాయం 21 శాతం క్షీణించి రూ. 42,428 కోట్ల నుంచి రూ. 33,666 కోట్లకు తగ్గింది. గ్రూప్‌లోని కొన్ని వ్యాపార విభాగాలు అంతగా పనితీరు ఆశించిన స్థాయిలో లేనందున వాటి విలువలను తగ్గించడం వల్ల నష్టాలు నమోదు చేయాల్సి వచ్చిందని టాటా స్టీల్ పేర్కొంది.